ఇండోనేషియా కంపెనీలతో ఎలాన్‌ మస్క్‌ భారీ ఒప్పందం!

10 Aug, 2022 13:58 IST|Sakshi

మైక్రో బ్లాగింగ్‌ దిగ్గజం ట్విట్టర్‌ నుంచి టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్‌ న్యాయపరమైన ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అయినా సరే మస్క్‌ తన వ్యాపార కార్యకలాపాల్ని ముమ్మరం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో టెస్లా ఎలక్ట్రిక్‌ కార్ల లిథియం అయాన్‌ బ్యాటరీల్లో ఉపయోగించే నికెల్‌ కోసం ఇండోనేషియా ప్రాసెసింగ్ యూనిట్లతో 5 బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందాల్ని కుదుర్చుర్చుకున్నారు.

ఇండోనేషియాలోని సులవేసి ద్వీపంలోని మొరోవాలీ కేంద్రంగా నికెల్ ప్రాసెసింగ్ కంపెనీలతో టెస్లా ఐదేళ్ల ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఇండోనేషియా సీనియర్ క్యాబినెట్ మంత్రి  తెలిపారు. టెస్లా లిథియం బ్యాటరీల్లో ఈ నికెల్ మెటీరియల్‌ను ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది. 

ఈ సందర్భంగా ఎలాన్‌ మస్క్‌ ఇండోనేషియాలో టెస్లా ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందా?అన్న ప్రశ్నలకు మంత్రి లుహుత్ పాండ్జైటన్ స్పందించారు. కార్ల ఉత్పత్తి కేంద‍్రం ఏర్పాటుపై ఆగస్ట్‌లో ఎలాన్‌ మస్క్‌తో భేటీ కానున్నట్లు వెల్లడించారు.  

"మేం టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్‌తో నిరంతరం చర్చలు జరుపుతున్నాం. ఈ చర్చల ఫలితంగా మస్క్‌ ఇండోనేషియా నుంచి రెండు ప్రొడక్ట్‌లను కొనుగోలు చేయడం ప్రారంభించారు. కానీ ఆ ప్రొడక్ట్‌లు ఏంటనేది చెప్పేందుకు మంత్రి లుహుత్‌ నిరాకరించారు.

చదవండి👉 డబ్బు లేదు, టెస్లా షేర్లను మళ్లీ అమ్మేసిన ఎలాన్ మస్క్!

మరిన్ని వార్తలు