టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్‌ అరుదైన రికార్డులు

3 Jan, 2023 12:31 IST|Sakshi

గతేడాది రికార్డ్‌ స్థాయిలో 1.3 మిలియన్ కార్లను విక్రయించినట్లు ప్రముఖ ఈవీ దిగ్గజం టెస్లా ప్రకటించింది. అయితే కంపెనీ విక్రయాలను దాదాపు ప్రతి సంవత్సరం 50 శాతం పెంచుతామని సీఈవో ఎలాన్‌ మస్క్‌ ప్రకటించిన దానికంటే తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.  
    
2022లో 1.3 మిలియన్‌ కార్లను అమ్మగా..ఆ సంఖ్య 2021లో 936,000గా ఉంది. కంపెనీ నిర్ధేశించిన 50 శాతం కార్ల అమ్మకాలు ఇంకా 1.4 మిలియన్లు ఉన్నాయని తెలిపిన మస్క్‌..సంవత్సరానికి 40 శాతం అమ్మకాలు జరపగా, ఉత్పత్తి 47 శాతం పెరిగి 1.37 మిలియన్లకు చేరుకుందని అన్నారు. 
    
కంపెనీ అత్యధికంగా అమ్ముతున్న మోడల్స్ వై, 3 ధరల్ని టెస్లా 7,500 డాలర్లకు తగ్గించి అమ్మకాలు నిర్వహించింది. కానీ రెసిషన్‌ కారణంగా కార్ల కొనుగోళ్లు తగ్గిపోయాయి.  దీనికి తోడు చైనాలో పెరుగుతున్న కరోనా కేసుల కారణంగా షాంఘై ఫ్యాక్టరీలో టెస్లా ఉత్పత్తిని తగ్గించింది.

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు