టెస్లా మరో ఘనత: ఆనందంలో ఎలాన్‌ మస్క్‌ 

15 Aug, 2022 14:20 IST|Sakshi

 మరో కీలక మైలురాయిని దాటేసిన టెస్లా

 30 లక్షల  టెస్లా కార్ల  తయారీ: ఎలాన్‌  మస్క్‌

న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ కార్ కంపెనీ టెస్లా కీలక మైలురాయిని అధిగమించింది. టెస్లా 3 మిలియన్ల కార్ ప్రొడక్షన్ మార్క్‌ను క్రాస్‌ చేసిందని టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ప్రకటించారు.ఈ సందర్భంగా టెస్ల సిబ్బందికి ప్రత్యేక అభినందనలు తెలిపారు.

3 మిలియన్ల కార్లను తయారు చేసినందుకు అభినందనలు గిగా షాంఘై! మొత్తంగా టెస్లా 3 మిలియన్లకు పైగా ఉత్పత్తి మార్క్‌ను దాటేసింది అంటూ మస్క్ ఆదివారం  ట్వీట్ చేశారు.  చైనాలో టెస్లా మూడవ అతిపెద్ద వాహన తయారీ సంస్థ. ఈ ఏడాది ప్రథమార్థంలో దాదాపు 2లక్షల వాహనాలను కస్టమర్లకు డెలివరీ చేసింది. టెస్లా కార్లు ఇప్పటివరకు 40 మిలియన్ మైళ్లకు పైగా సాధించింది. ఈ ఏడాది చివరికి  100 మిలియన్ మైళ్లకు చేరాలని కంపెనీ భావిస్తోంది. రానున్న సంవత్సరాల్లో టెస్లా కనీసం 10 లేదా 12 గిగాఫ్యాక్టరీలను నిర్మించవచ్చని ఇటీవల  ఎలాన్‌ మస్క్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే.

అలాగే 2019లో ప్రకటించిన, చాలాకాలంగా ఎదురుచూస్తున్న సైబర్‌ట్రక్‌ కూడా త్వరలో ఆవిష్కృత మవుతుందన్నారు. కాగా క్యూ2లో టెస్లా 16.93 బిలియన్ల డాలర్ల ఆదాయాన్ని నివేదించింది. బెర్లిన్ వెలుపల టెస్లా కొత్త ఫ్యాక్టరీ జూన్‌లో వారానికి వెయ్యి కార్లను దాటిందని మస్క్  వెల్లడించారు.

మరిన్ని వార్తలు