లేఆఫ్స్‌ వేళ ఫ్రెంచ్‌ కంపెనీ సంచలనం.. కొత్తగా 12 వేల మందికి ఉద్యోగాలు!

27 Feb, 2023 21:44 IST|Sakshi

అన్ని రంగాలకు చెందిన పెద్ద పెద్ద కంపెనీలు లేఆఫ్స్‌ పేరుతో వేలాదిగా ఉద్యోగులను తొలగిస్తున్న తరుణంలో ఫ్రెంచ్‌కు చెందిన మల్టీ నేషన్‌ కంపెనీ థేల్స్ గ్రూప్ సంచలన విషయం వెల్లడించింది. ఏరోస్పేస్, రక్షణ, భద్రత, డిజిటల్ ఐడెంటిటీ, సెక్యూరిటీ రంగాల్లో ఈ ఏడాదిలో  12 మంది కొత్త ఉద్యోగులను నియమించుకోనున్నట్లు పేర్కొంది.

కంపెనీ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 12 వేల మందిని నియమించుకోనుండగా ప్రత్యేకంగా ఫ్రాన్స్‌లో 5,500, భారత్‌లో 550, యునైటెడ్ కింగ్‌డమ్‌లో 1,050, ఆస్ట్రేలియాలో 600, అమెరికాలో 540 మంది కొత్త ఉద్యోగులను తీసుకోవాలని భావిస్తోంది. ముఖ్యంగా భారత్‌లో ఇంజినీరింగ్ ఆపరేషన్స్‌ కోసం ఉద్యోగులను నియమించుకుంటోంది.

(ఇదీ చదవండి: Layoffs: నా చిన్నారి పాపకు నేనేం చెప్పను? తొలగించిన గూగుల్‌ ఉద్యోగిని ఆవేదన!)

థేల్స్ గ్రూప్ తన అన్ని వ్యాపార విభాగాల్లోనూ నియామకాలు చేపడుతోంది.  భారత్‌లోని నోయిడా, బెంగళూరులో ఉన్న సైట్‌ల కోసం శాశ్వత, ఒప్పంద ప్రాతిపదికన రిక్రూట్ చేస్తోంది.  ముఖ్యంగా  హార్డ్‌వేర్ ఇంజనీర్లు, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, సిస్టమ్స్ ఆర్కిటెక్ట్‌లు, డిజిటల్ టెక్నాలజీ నిపుణులు, ప్రాజెక్ట్ మేనేజర్‌ల కోసం చూస్తోంది.

(ఇదీ చదవండి: సీఈవో జీతం తెలిసి యూజర్లు షాక్‌! దీంతో ఎలా బతుకుతున్నారు సార్‌?)

మరిన్ని వార్తలు