‘దండాలయ్యా..’ అంటూ మోదీకి మొక్కుతూ ఫొటోలు

19 Jul, 2021 16:03 IST|Sakshi

ఎదురుగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ కటౌట్‌లు, ఫ్లెక్సీలు.. వాటికి ఎదురుగా నిల్చుని జనాలు దణ్ణం పెడుతున్న ఫొటోలు. సోషల్‌ మీడియాలో ఇప్పుడు కొనసాగుతున్న కొత్త ట్రెండ్‌ #ThankYouModiJiChallenge. బంకుల్లో ఆ ఫొటోలు చూస్తే చాలు.. పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలకు నిరసనగా ఈ ఛాలెంజ్‌ నడుస్తోందని చెప్పనక్కర్లేదు.

ఈ ట్రెండ్‌ ఎలా మొదలైంది అనేది స్పష్టత లేదుగానీ, సరదా కోసమైనా కొందరు ఈ ఛాలెంజ్‌ పాల్గొంటున్నారు. యూపీఏ పాలనలో మోదీ చేసిన ట్వీట్లను తెరపైకి తెస్తూ.. ఏడేళ్ల పాలనలో ధరల పెంపును ప్రస్తావిస్తూ ఫన్నీ మీమ్స్‌తో మరికొందరు ట్రెండ్‌ను కొనసాగిస్తున్నారు.

ఇక ప్రతిపక్ష కాంగ్రెస్‌ తమ విమర్శలకు ఈ ట్రెండ్‌ను వాడేసుకుంటోంది. ప్రస్తుతం నడుస్తున్న పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపుపై చర్చకు ప్రతిపక్ష కాంగ్రెస్‌ పట్టుబట్టడం చూస్తున్నాం. అయితే కాంగ్రెస్‌ కొనసాగిస్తున్న ఈ నెగెటివ్‌ ట్రెండ్‌ను పాజిటివ్‌గా మార్చేచే ప్రయత్నం చేస్తున్నారు మోదీ మద్ధతుదారులు.

ఇక ఈరోజు పెట్రో ధరల్లో ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు. మొత్తం మెట్రో నగరాల్లో  ముంబైలో గరిష్టంగా పెట్రోల్‌ లీటర్‌ ధర రూ.107.83 కాగా, డీజిల్‌ ధర రూ.97.45గా ఉంది.హైదరాబాద్‌ లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.105.52గా ఉండగా డీజిల్‌ ధర రూ. 97.96గా ఉంది.

మరిన్ని వార్తలు