పవర్‌ ఆఫ్‌ సారీ: రూ. 6 లక్షలకు..50 కోట్లు వచ్చాయ్‌!

17 Sep, 2022 15:59 IST|Sakshi
photo courtesy : BusinessToday.In

సక్సెస్‌పుల్‌ విమెన్‌ ఆంట్రప్రెన్యూర్స్‌గా  ఇంజనీర్‌ అక్కాచెల్లెళ్లు

సుజాత+ తానియా = ‘సుత’ బ్రాండ్‌

చీరను ఆన్‌లైన్‌లో కంటే చూసి కొంటేనే బావుంటుంది: సుత

మార్కెట్‌ తీరును బాగా అధ్యయనం చేయాలి

సాక్షి,ముంబై: ఇంజనీర్లు చేస్తున్న ఉద్యోగం వారికి సంతృప్తి ఇవ్వలేదు. దీనికిమించి ఇంకేదో చేయాలని గట్టిగా అనుకున్నారు. ఆ ఆలోచన  ‘సుత’  అనే చీరల బ్రాండ్‌ ఆవిష్కారానికి నాంది పలికింది. తమదైన ప్రతిభ, చొరవతో రాణిస్తూ సక్సెస్‌పుల్‌ విమెన్‌ ఆంట్రప్రెన్యూర్స్‌గా అవతరించారు. చెరొక మూడు లక్షల రూపాయల పెట్టుబడితో ప్రారంభించిన వ్యాపారం కేవలం ఆరేళ్లలో ఇపుడు 50 కోట్లకు చేరింది. 

బిజినెస్ టుడే కథనం ప్రకారం ముంబైకి చెందిన  సుజాత (36) తానియా (34) ఇద్దరూ ఇంజనీర్లుగా పనిచేసేవారు. కొన్నాళ్ల తరువాత మరింత కష్టపడి ‘ప్రభావవంతమైన’ చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే పెద్దపెద్ద వ్యాపారాలు చేయాలన ఆలోచనలేనప్పటికీ, చీరల పట్ల మక్కువతో చీరల బిజినెస్‌ బావుంటుందని నిశ్చయించు కున్నారు. పైగా ఇద్దరికీ భారతీయ సాంప్రదాయ దుస్తులు, తీరుతెన్నులపై మంచి అవగాహన ఉంది.  అలా  తమ ఇరువురి  పేర్లలోని సు, త  అనే మొదటి రెండు అక్షరాలతో ‘సుత’ (Suta) బ్రాండ్‌ని సృష్టించారు. 


photo courtesy : BusinessToday.In

ఒక్కొక్కరు రూ.3 లక్షలు వెచ్చించి రూ.6 లక్షల కార్పస్‌ ఫండ్‌తో మొదలుపెట్టారు. అలా ఇన్‌స్టాగ్రాంలో పాపులర్‌ బ్రాండ్‌గా అవతరించింది. అలా అంచెలంచెలుగా విస్తరిస్తూ గత ఏడాది తమ వ్యాపారాన్ని  50 కోట్ల ఆదాయం సాధించే స్థాయికి  తెచ్చారు. ఇప్పుడిక భౌతిక దుకాణాలను తెరవడానికి సిద్ధంగా ఉన్నారు. సాంప్రదాయ,నేత దుస్తులు, నేతన్నలపై లోతైన పరిశోధన చేశారు. మొదట్లో బెంగాల్, ఫూలియా, బిష్ణుపూర్, రాజ్‌పూర్, ధనియాఖలి వంటి గ్రామాలు, ఒరిస్సాతో పాటు చీరలకోసం అవసరమైన ప్రతిచోటికీ వెళ్లారు. అలా మొదట్లో అల్మారలో మొదలైన ప్రస్థానం గిడ్డంగిని అద్దెకు తీసుకునేదాకా శరవేగంగా వృద్ధిచెందేలా  పరుగులు పెట్టించారు. 

కరోనా మహమ్మారి తరువాత అందరూ ఆన్‌లైన్ స్టోర్‌ల వైపు మొగ్గుచూపుతోంటే..లాక్‌డౌన్‌లు ముగిసిన వెంటనే భౌతిక దుకాణాలను తెరవాలని సుతా ప్లాన్‌ చేస్తోంది. ఎందుకంటే దుస్తులు, ముఖ్యంగా చీరల షాపింగ్ ఆన్‌లైన్‌లో కంటే భౌతికంగా చూసిన తరువాత కొనడానికి ఇష్టపడతారు. అందుకే కోల్‌కతాలో ఒకటి ప్రారంభించగా, త్వరలోనే బెంగుళూరులో తొలి ఫ్లాగ్‌షిప్ స్టోర్‌ను ప్రారంభించబోతున్నారు. 


photo courtesy : BusinessToday.In

తమ దగ్గర చీరలు సాధారణంగా రూ.2,500 నుంచి రూ.3,500 వరకు ఉంటాయని చెప్పారు. ఏదైనా బిజినెస్‌ స్టార్ట్‌ చేసే ముందు మార్కెట్‌ను బాగా స్టడీ చేయాలంటున్నారు. అంతేకాదు అక్కాచెల్లెళ్లుగా చిన్నచిన్న విషయాలపై పోట్లాడుకున్నా.. బిజినెస్‌ విషయంలోమాత్రం చాలా దృఢంగా ఉంటామని చెప్పారు. అలాగే సెల్ఫ్ ఫండింగ్‌తో నిర్వహించిన తమ బిజినెస్‌ను వీలైనంతవరకు  అలాగే  కొనసాగిస్తామని  సుజాత ధీమా వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు