పెట్రో పరుగు: ఇవాళ ఎంత పెరిగిందంటే!

6 May, 2021 11:08 IST|Sakshi

మూడో రోజూ  పెట్రో సెగ

పెట్రోల్ పై 25 పైస‌లు, డీజిల్‌పై30 పైస‌లు

సాక్షి, ముంబై: దేశవ్యాప్తంగా  ఇంధన ధరల సెగ కొనసాగుతోంది. వాహనదారులు భయపడినట్టే అవుతోంది.  అసెంబ్లీ ఎన్నికల  ఫలితాలు వెలువడిన తరువాతి రోజు నుంచి పెట్రో బాదుడు తప్పదన్న అంచనాల కనుగునే  వ‌రుస‌గా మూడో  రోజు గురువారం  కూడా పెట్రోలు, డీజిల్‌  ధరలను పెంచుతూ ఆయిల్‌ మార్కెటింగ్‌ సంస్థలు నిర్ణయించాయి. లీట‌ర్ పెట్రోలుపై .25పైస‌లు, డీజిల్ రూ.30 పైస‌లు చొప్పున పెంచేశాయి.  దీంతో దేశ రాజ‌ధాని ఢిల్లీలో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ.90.99, డీజిల్‌ రూ.81.42కు చేరింది.

ప్రధాన నగరాల్లో  లీటరుకు పెట్రోలు, డీజిల్‌ ధరలు ఇలా ఉన్నాయి 
ముంబైలో పెట్రోల్ రూ.97.34, డీజిల్‌ రూ.88.49
 చెన్నైలో పెట్రోల్‌ రూ.92.90, డీజిల్‌ రూ.86.35
కోల్‌కతాలో పెట్రోల్‌ రూ.91.14, డీజిల్‌ రూ.84.26
బెంగ‌ళూరులో పెట్రోల్‌ రూ.94.01, డీజిల్‌ రూ.86.31

హైద‌రాబాద్‌లో పెట్రోల్‌ రూ.94.57, డీజిల్‌ రూ.88.77
అమరావతిలో పెట్రోల్‌ రూ.97.14, డీజిల్‌ రూ.90.79
విశాఖపట్టణం పెట్రోల్‌ రూ.95.90, డీజిల్‌ రూ.89.59
విజయవాడపెట్రోల్‌ రూ .96.72, డీజిల్‌ రూ. 90.41

చదవండి : కరోనా మరణ మృదంగం: సంచలన అంచనాలు 

మరిన్ని వార్తలు