T-Hub 2.0 Hyderabad: అతిపెద్ద ఇంక్యుబేటర్ టీహబ్‌పై రతన్‌ టాటా స్పందన

28 Jun, 2022 13:23 IST|Sakshi

ఇండియన్‌ స్టార్టప్‌లకుగొప్ప బూస్ట్‌ టీ-హబ్‌:  రతన్‌ టాటా 

సాక్షి,హైదరాబాద్‌: తెలంగాణాలో ప్రతిష్టాత్మక టీ-హబ్‌ మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. ముఖ్యంగా ప్రపంచంలోనే అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేటర్ టీహబ్‌గా ఐటీ హబ్ అందుబాటులోకి రానుంది. రాష్ట్ర ఐటీ శాఖామంత్రి కేటీఆర్‌తో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం లాంచ్‌  చేయనున్నారు. ఈ ఇంక్యుబేటర్ ప్రారంభోత్సవంపై ఇప్పటికే చాలామంది రాజకీయ, వాణిజ్యరంగ ప్రముఖులతోపాటు క్రీడా, సినీరంగ సెలబ్రిటీలు స్పందించారు. తాజాగా ప్రముఖ వ్యాపారవేత్త, టాటా గ్రూపు అధినేత రతన్‌ టాటా సోషల్‌మీడియాలో స్పందించడం విశేషంగా నిలిచింది.

హైదరాబాద్‌లో టీ హబ్‌పై  దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ జాబితాలో రతన్ టాటా కూడా నిలిచారు. ఇది భారతీయ స్టార్టప్ ఎకోసిస్టమ్‌కు  భారీ ప్రోత్సాహాన్ని అందిస్తుందని ఆయన ట్వీట్‌ చేశారు.  తెలంగాణ ఐటీ మంత్రి కేటీ రామారావు ట్విటర్‌ పోస్ట్‌కు స్పందించిన టాటా టీహబ్‌ను ప్రశంసించారు.  ఈ సందర్భంగా  తెలంగాణా సీఎం కేసీఆర్‌కు, ప్రభుత్వానికి టాటా అభినందనలు  తెలిపారు. 

కాగా హైదరాబాద్ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్‌కు భారీ ఊరటనిచ్చేలా కొత్త టీ-హబ్‌ను జూన్ 28న కేసీఆర్ ప్రారంభిస్తారంటూ కేటీఆర్ ఆదివారం ట్వీట్ చేసిన సంగతి తెలిసందే.  దీనిపై నాస్కామ్ ప్రెసిడెంట్ దేబ్జానీ ఘోష్, టాలీవుడ్‌ యాక్టర్స్‌ విజయ్ దేవరకొండ, సమంతా రూత్ ప్రభు, మహేష్ బాబుతో సహా  పలువురు ప్రముఖులు కొత్త టీ-హబ్ పై ప్రశంసలు కురిపించారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు