RED RAIL Train Booking Service: టిక్కెట్ల బుకింగ్‌ ఇప్పుడు ఇంకా ఈజీ

30 Nov, 2021 08:01 IST|Sakshi

రెడ్‌రైల్‌తో రైల్వే టికెట్ల బుకింగ్‌

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఆన్‌లైన్‌లో బస్‌ టికెట్లను విక్రయిస్తున్న రెడ్‌బస్‌ తాజాగా రెడ్‌రైల్‌పేరుతో రైల్వే టికెట్ల బుకింగ్‌ విభాగంలోకి ప్రవేశించింది. ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్, టూరిజం కార్పొరేషన్‌ (ఐఆర్‌సీటీసీ) భాగస్వామ్యంతో ఈ సేవల్లోకి అడుగుపెట్టింది. ప్రతిరోజూ 90 లక్షల పైచిలుకు రైల్వే సీట్లు రెడ్‌బస్‌ యాప్‌లోనూ బుకింగ్‌కు అందుబాటులో ఉంటాయని కంపెనీ ప్రకటించింది.

మరిన్ని వార్తలు