TikTok: యూజర్లకు రూ.683 కోట్లను చెల్లించనున్న టిక్‌టాక్‌..! ఎందుకంటే...?

20 Nov, 2021 18:21 IST|Sakshi

TikTok May Owe You Money From Its $92 Million Data Privacy Settlement: చైనాకు చెందిన షార్ట్‌ వీడియో యాప్‌ టిక్‌టాక్‌ అమెరికన్‌ యూజర్లకు సుమారు రూ. 683 కోట్లను చెల్లించనున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది అక్టోబర్‌ 1 వరకు టిక్‌టాక్‌లో నమోదైన యూజర్లకు ఈ మొత్తాన్ని చెల్లించనుంది. క్లాస్‌ యాక్షన్‌ సెటిల్‌మెంట్‌లో భాగంగా టిక్‌టాక్‌ యూజర్లకు రూ. 683 కోట్లను పొందడానికి అర్హులు. అందులో భాగంగా టిక్‌టాక్‌ ఇప్పటికే అర్హత కల్గిన 89 మిలియన్ల అమెరికన్‌ యూజర్లకు నోటిఫికేషన్‌ రూపంలో మెసేజ్‌ను పంపినట్లు తెలుస్తోంది. 
చదవండి: ప్రపంచంలో అత్యంత పొడవైన కారును చూశారా..!

ఎందుకంటే..!
యూఎస్‌ యూజర్ల నుంచి వ్యక్తిగత డేటాను వారి అనుమతి లేకుండా టిక్‌టాక్‌ సేకరించిందనే దావాలు నిరూపితమయ్యాయి. అంతేకాకుండా బయోమెట్రిక్‌ ఇన్ఫర్మేషన్‌ ప్రైవసీ చట్టాన్ని టిక్‌టాక్‌ పూర్తిగా ఉల్లంఘించిందని తెలుస్తోంది.  ​క్లాస్‌ యాక్షన్‌ వేసిన దావాపై టిక్‌టాక్‌ ఖండిస్తూనే...అమెరికాలోని యూజర్లకు 92 మిలియన్‌ డాలర్లను చెల్లించడానికి టిక్‌టాక్‌ అంగీకరించడం గమనార్హం.

అర్హత కల్గిన టిక్‌టాక్‌ యూజర్లు తమ మాస్టర్‌కార్డ్‌ , పే పాల్‌, వెన్మో ద్వారా చెల్లింపులను క్లెయిమ్‌ చేసుకోవచ్చునని టిక్‌టాక్‌ పేర్కొంది. అర్హత ఉన్న ప్రతి వ్యక్తి క్లెయిమ్‌ చేస్తే...సుమారు 5 డాలర్ల నుంచి 0.89 డాలర్లు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.  
చదవండి: షాకిచ్చిన ఫోక్స్‌వ్యాగన్‌! సైలెంట్‌గా ధరల పెంపు.. ఏ మోడల్‌పై ఎంత?

మరిన్ని వార్తలు