TikTok BGMI Comeback: మళ్లీ భారత్‌లోకి రీ ఎంట్రీ కోసం ఆరాటం, టిక్‌టాక్‌ సరికొత్త వ్యూహం ఇదేనా!

7 Aug, 2022 10:48 IST|Sakshi

టిక్‌టాక్‌ యూజర్లకు శుభవార్త. దేశ భద్రత దృష్ట్యా భారత కేంద్ర ప్రభుత్వం జున్‌ 2020లో టిక్‌టాక్‌పై బ్యాన్‌ విధించింది. ఇప్పుడా ఆ యాప్‌ తిరిగి భారత్‌లో తన కార్యకలాపాల్ని కొనసాగించనున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. 

టిక్‌టాక్‌ పరిచయం అక్కర్లేని పేరు. చైనాకి చెందిన బైట్‌ డ్యాన్స్‌ సంస్థ తయారు చేసిన ఈ యాప్‌ ప్రపంచ దేశాల్లో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది. భారత్‌ - చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. గల్వాన్‌ లోయలో జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు వీర మరణం పొందారు. దీంతో భారత్‌లో చైనా వస్తువులు,యాప్స్‌పై నిషేధించాలన్న డిమాండ్‌ దేశవ్యాప్తంగా పెరుగుతూ వచ్చింది. దీంతో కేంద్రం దేశ సార్వభౌమాధికారం, సమగ్రత, రక్షణ, ప్రజాభద్రత దృష్ట్యా మొత్తం 59 యాప్‌లపై నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించింది. వాటిలో టిక్‌టాక్‌ యాప్‌ కూడా ఉంది. 

అయితే భారత్‌లో టిక్‌ టాక్‌కు ఉన్న క్రేజ్‌ను క్యాష్‌ చేసుకునేందుకు బైట్‌ డ్యాన్స్‌ సంస్థ దేశీయ సంస్థలతో పలు మార్లు చర్చులు జరిపింది. ఆ ప్రయత్నాల్ని విఫలమయ్యాయి. ఈ తరుణంలో బైట్‌ డ్యాన్స్‌ సంస్థ భారత్‌లో టిక్‌టాక్‌ యాప్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు ముంబైకి చెందిన గేమింగ్‌ సంస్థ స్కైస్పోర్ట్స్‌తో, ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ హీరా నందిని గ్రూప్‌కు చెందిన పేరెంట్ సంస్థ యోటా ఇన్ ఫ్రాస్టక్చర్‌తో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా తమతో బైట్‌డ్యాన్స్‌ సంప్రదింపులు జరుపుతుందన్నారు. ఆ చర్చలు జరుగుతున్నాయని..త్వరలో టిక్‌టాక్‌ను వినియోగంలోకి తెస్తామని స్కై స్పోర్ట్స్‌ సీఈవో శివ నంది తెలిపారు. దీంతో పాటు బీజీఎంఐ సైతం గేమింగ్‌ ప్రియులు వినియోగించే అవకాశం త్వరలో రానుందని ఇన్‌స్ట్రాగ్రామ్‌ స్టోరీస్‌లో వెల్లడించారు. 

భారత్‌లో బీజీఎంఐపై బ్యాన్‌ విధించడంపై శివ నంది స్పందించారు. బీజీఎంఐను నిషేధించాలని కేంద్రం అనుకోకుండా నిర్ణయం తీసుకోలేదని, ఇందుకోసం సుమారు 5నెలల సమయం తీసుకుందన్నారు. కేంద్రం నిర్ణయంపై బీజీఎంఐ మాతృ సంస్థ క్రాఫ్టన్‌కు నోటీసులు అందించినట్లు చెప్పారు. టిక్‌టాక్‌తో పాటు బీజీఎంఐని వినియోగించే  అవకాశం త్వరలో రానుంది. కేంద్రం బీజీఎంపై శాశ్వతంగా బ్యాన్‌ చేయలేదని.. తాత్కాలికంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.   

మరిన్ని వార్తలు