TIME Cover Ft. Zuckerberg: 11 ఏళ్లకు అంతా ఉల్టా పల్టా? ఫేస్‌బుక్‌ డిలీట్‌ అంటూ కవర్‌ పేజీ

11 Oct, 2021 19:26 IST|Sakshi

TIME Cover Ft. Zuckerberg: మార్క్‌ జుకమ్‌బర్గ్‌ ఈ పేరు అందరికీ సుపరిచతమైనదే. ఫేస్‌బుక్‌తో సోషల్‌మీడియా ప్రస్థానానికి నాంది పలికాడు మార్క్‌.   ఫేస్‌బుక్‌ను స్థాపించడంలో జుకమ్‌బర్డ్‌ కీలకపాత్రను పోషించాడు. ఫేస్‌బుక్‌ స్థాపనతో అంచెలచెలుగా జుకమ్‌బర్గ్‌ ప్రపంచంలోనే సంపన్నుల జాబితాలో చేరాడు. ఫేస్‌బుక్‌ ఒక్కటే కాకుండా...వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌, వంటి సోషల్‌ మీడియా యాప్స్‌ను కూడా శాసించే రేంజ్‌కు జుకమ్‌బర్గ్‌ వెళ్లాడు.

ఫేస్‌బుక్‌పై భారీ ఎత్తున ఆరోపణలు...!
గత కొద్ది రోజుల నుంచి ఫేస్‌బుక్‌పై అనేక ఆరోపణలు వస్తున్నాయి. ఫేస్‌బుక్‌ కొంతమంది వ్యక్తుల కోసమే పనిచేస్తుదంటూ వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ ఫేస్‌బుక్‌పై దుమ్మెతి పోసింది. కొంత మంది వీఐపీల ప్రైవసీ విషయంలో ఫేస్‌బుక్‌ వారిని అందలాలను ఎక్కిస్తోందని వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ ఆరోపణలు చేసింది. వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ ఒక్కటే కాదు ఫ్రాన్సెస్‌ హాగెన్‌ అనే మాజీ ఉద్యోగిని కూడా ఫేస్‌బుక్‌పై తీవ్ర ఆరోపణలను చేసింది. ఫేస్‌బుక్‌ దృష్టిలో యూజర్ల‘భద్రత కంటే లాభాలే ముఖ్యం’ అంటూ యూఎస్‌ కాంగ్రెస్‌ వేదికగా పలు సంచలన రహస్య పత్రాలను బయటపెట్టింది. దీంతో ఫేస్‌బుక్‌ వ్యవస్థాపకుడు మార్క్‌ జుకమ్‌బర్గ్‌ ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. మార్క్‌ జుకమ్‌బర్గ్‌పై ప్రపంచవ్యాప్తంగా అనేక విమర్శలు వెలువెత్తుతున్నాయి. 

పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ నుంచి...డిలీట్‌ వరకు...!
తాజాగా ఫేస్‌బుక్‌ అధినేత మార్క్‌ జుకమ్‌ బర్గ్‌ ఫోటోను ప్రముఖ అమెరికన్‌ మ్యాగజీన్‌ టైమ్స్‌ మ్యాగజీన్‌ కవర్‌ మీద  ప్రచురించింది. ఇప్పుడు ఈ ఫోటోపై సర్వత్రా చర్చ జరుగుతుంది. టైమ్స్‌ మ్యాగజీన్‌ జుకమ్‌బర్గ్‌ ఫోటోపై...‘డిలీట్‌ ఫేస్‌బుక్‌..క్యాన్సల్‌...డిలీట్‌... ’అంటూ మ్యాగజీన్‌ కవర్‌ను రూపోందించింది. ఫేస్‌బుక్‌ మాజీ ఉద్యోగిని ఫ్రాన్సెస్‌ హాగెన్‌ ఫేస్‌బుక్‌పై బయటపెట్టిన రహస్య పత్రాలను ఉద్దేశించి టైమ్స్‌ మ్యాగజీన్‌ జుకమ్‌బర్గ్‌ కవర్‌ఫోటోను ప్రచురించింది.

ఇక్కడ విషయమేమిటంటే ఇదే టైమ్స్‌ మ్యాగజీన్‌ 2010లో పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా మార్క్‌ జుకమ్‌బర్గ్‌ ఫోటోను కవర్‌పేజీపై ప్రచురించింది. ఆ సమయంలో  మార్క్‌ ఏవిధంగా ఎదిగాడనే అంశాలను  టైమ్స్‌ తన మ్యాగజీన్‌లో పేర్కొంది. ప్రస్తుతం ఈ రెండు ఫోటోలు సోషల్‌మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. మార్క్‌ ఎక్కడి నుంచి ఎక్కడికి దిగజారాడని సోషల్‌మీడియాలో చర్చించుకుంటున్నారు.
చదవండి: Jeff Bezos and Elon Musk: వీళ్లిద్దరూ ఏక్‌ నెంబర్‌ 'పిసినారులు'

మరిన్ని వార్తలు