Anil Ambani: అంబానీకి అందమైన సందేశం

4 Jun, 2021 15:22 IST|Sakshi

అనిల్‌ అంబానీ పుట్టినరోజు

భార్య టీనా అంబానీ సందేశం

సాక్షి, ముంబై: పారిశ్రామికవేత్త అనిల్‌ అంబానీ పుట్టినరోజును  (జూన్‌ 4) పురస్కరించుకుని  ఆయన భార్య టీనా అంబానీ ఒక చక్కటి సందేశాన్ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. తన భర్త బర్డ్‌డేకి ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలను కూడా పోస్ట్‌ చేశారు. కుటుంబానికి అంకితమైనవాడు. అలసిపోని కార్మికుడు, ఆధ్యాత్మికంగా నిబద్ధత గలవాడు..చాలా రిజర్వ్‌గా ఉండే తన  అనిల్‌కి శుభాకాంక్షలంటూ ఒక హార్ట్‌ఫెల్ట్‌ నోట్ షేర్‌ చేశారామె. కుటుంబ బలం..మూలం అన్నీ ఆయనే అని ఈ సందర్భంగా టీనా పేర్కొన్నారు. అంతేకాదు నా రెక్కల బలానివి నువ్వు. నువ్వే నా సంతోషం అంటూ టీనా వ్యాఖ్యానించారు. తమ పిల్లలు జై అన్మోల్, జై అన్షుల్‌తో కలిసి ఉన్న అందమైన  ఫ్యామిలీ ఫోటోతో పాటు, మరో రెండు ఫోటోలను కూడా ఆమె పంచుకున్నారు.దీంతో అంబానీ కటుంబ సన్నిహితులు, స్నేహితులు కూడా అనిల్‌కు విషెస్‌ తెలిపారు. 

A post shared by Tina Ambani (@tinaambaniofficial)

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు