దేశంలో పెట్రో ధరలు,19 రాష్ట్రాల్లో సెంచరీ కొట్టాయి

23 Jul, 2021 09:10 IST|Sakshi

అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తగ్గడంతో వాటి ప్రభావం జాతీయ మార్కెట్లపై పడింది. దీంతో గత ఆదివారం నుంచి ఈ రోజు(శుక్రవారం) వరకు చమురు ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గత శనివారం లీటర్‌ పెట్రోల్‌పై 30 పైసలు పెరిగింది. ఇక ఈ నెలలో ఇప్పటి వరకు పెట్రోల్ ధర 9 సార్లు పెరగ్గా.. డీజిల్ ధర 5 సార్లు తగ్గింది.  

పెట్రోల్ ధర 39 సార్లు, డీజిల్ ధర 36 సార్లు  
ఈ ఏడాది ఏప్రిల్ నుంచి పెట్రోల్ ధరలు 39 సార్లు పెరిగింది. అదే సమయంలో డీజిల్ రేట్లు 36 సార్లు పెరిగాయి. దీంతో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పెట్రో రేట్లు రికార్డు స్థాయికి చేరుకున్నాయి.  

19 రాష్ట్రాల్లో సెంచరీ కొట్టాయి
దేశంలోని 19 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో పెట్రోల్ ధర లీటరు రూ .100 దాటింది. ఇందులో మహారాష్ట్ర, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఉత్తర ప్రదేశ్, హర్యానా, జమ్మూ కాశ్మీర్, ఒడిశా, లడఖ్, బీహార్, కేరళ, పంజాబ్, సిక్కిం రాష్ట్రాలు ఉన్నాయి.  

ఇక శుక్రవారం రోజు పెట్రోల్‌ ధరల వివరాలు
హైదరాబాద్‌ లో పెట్రోల్‌ ధర రూ .105. 83 ఉండగా డీజిల్ రూ .97.96గా ఉంది
ముంబై లీటర్‌ పెట్రోల్‌ ధర రూ .107.83 ఉండగా డీజిల్ ధర రూ .97.45గా ఉంది
ఢిల్లీలో పెట్రోల్‌ ధర రూ .101.84 ఉండగా డీజిల్ ధర రూ .89.87గా ఉంది
చెన్నైలో పెట్రోల్‌ ధర రూ102.49 ఉండగా డీజిల్ రూ .94.39 గా ఉంది
కోల్‌కతాలో పెట్రోల్‌ ధర రూ .102.08 ఉండగా డీజిల్ రూ .93.02 గా ఉంది
బెంగళూరు లో పెట్రోల్‌ ధర రూ .105.25 ఉండగా డీజిల్ రూ .95.26గా ఉంది

మరిన్ని వార్తలు