స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు

30 Mar, 2021 17:09 IST|Sakshi

బులియన్ మార్కెట్‌లో మంగళవారం 10 గ్రాముల బంగారం ధర స్వల్పంగా తగ్గింది. అయితే, కొన్ని నగరాల్లో ధరలు తగ్గితే మరికొన్ని చోట్ల స్వల్పంగా పెరిగాయి. దేశ రాజధాని న్యూఢిల్లీలో నేడు (మార్చి 26) బంగారం ధర స్వల్పంగా తగ్గింది. నగల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం 10 గ్రాములు రూ. 40733గా ఉంది. నిన్నటితో పోలిస్తే 10 గ్రాముల బంగారం ధర రూ.222 తగ్గింది. 24 క్యారెట్ల మేలిమి బంగారం(ప్యూర్ గోల్డ్) ధర ప్రస్తుతం 10 గ్రాములు రూ.44468 ఉంది. నిన్నటితో పోలిస్తే రూ.242 తగ్గింది. 

అదే విదంగా హైదరాబాద్ మార్కెట్‌లో 22 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం 10 గ్రాములు రూ.41,700 నుంచి రూ.41,350కు తగ్గింది. నిన్నటితో పోలిస్తే 10 గ్రాముల బంగారం ధర రూ.350 తగ్గింది. 24 క్యారెట్ల మేలిమి బంగారం(ప్యూర్ గోల్డ్) ధర ప్రస్తుతం 10 గ్రాములు రూ.45,110  నుంచి రూ.45,490కు తగ్గింది. నిన్నటితో పోలిస్తే రూ.380 తగ్గింది. బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.64,750 నుంచి రూ. 63,683కు తగ్గింది. బంగారం ధర హెచ్చుతగ్గులపై ఎన్నో అంశాలు ప్రభావితం చూపుతాయి. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు కారణాల వల్ల బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు ఉంటాయి.

చదవండి:

ఏప్రిల్ 1 నుంచి కీలక మార్పులు

రంకెలేసిన బుల్‌: భారీ లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు

మరిన్ని వార్తలు