మళ్లీ పెరిగిన బంగారం ధరలు!

5 Apr, 2021 17:11 IST|Sakshi

బంగారం ధరలు స్వ‌ల్పంగా పెరిగాయి. గత వారం బంగారం ధరలు తగ్గినట్లే తగ్గి భారీగా పెరిగాయి. కొందరు దేశీయ విశ్లేషకులు భవిష్యత్లో బంగారం ధరలు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. అందుకు కారణం కరోనా కేసులు పెరగడమే అంటున్నారు. కరోనా కేసులు ఎంతలా పెరిగితే, బంగారం ధరలు అంతలా పెరుగుతాయని అంటున్నారు. ఆల్రెడీ ఆ ట్రెండ్ కనిపిస్తోందని చెబుతున్నారు. ఇండియన్ బులియన్, జెవెల్లెర్స్ అసోసియేషన్ ప్రకారం దేశ రాజధాని న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో నేడు స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర రూ.44,917 నుంచి రూ.45,176కు పెరిగింది. అలాగే, నగల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర రూ.41,144 నుంచి 41,381కు పెరిగింది. అంటే ఒక్కరోజులో 237 రూపాయలు పెరిగింది అన్నమాట.

ఇక హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. నగల తయారీకి వాడే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.42,260గా ఉంది. అలాగే పెట్టుబడులు పెట్టేందుకు వీలుగా ఉండే 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ ధర 10 గ్రాములు రూ.46,100 ఉంది. హైదరాబాద్, విజయవాడలలో ధరలు ఒకేలా ఉన్నాయి. బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా పెరిగాయి. నేడు కేజీ వెండి ధర రూ.63,634 నుంచి రూ.64,546కు పెరిగింది. బంగారం ధర హెచ్చుతగ్గులు అనేది ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు విషయాలపై ఆధారపడి ఉంటుంది.

చదవండి:

కొత్త ఇళ్లు కొనే వారికి ఎస్‌బీఐ షాక్!

బంగారం ధర మరింత దిగొస్తుందా? లేదా?


 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు