పసిడి ప్రియులకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం & వెండి ధరలు

28 Sep, 2023 12:10 IST|Sakshi

Gold And Silver Price: వినాయక చవితి సంబరాలు దాదాపు ముగింపు దశకు వచ్చాయి, త్వరలో విజయదశమి కూడా రానుంది. ఈ తరుణంలో బంగారం ధర భారీగా తగ్గింది. ఈ రోజు (2023 సెప్టెంబర్ 28) 10 గ్రాముల 22 క్యారెట్స్ గోల్డ్ మీద ఏకంగా రూ. 600 తగ్గింది. ప్రాంతాల వారీగా పసిడి ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ చూసేద్దాం.

👉 విజయవాడలో ఒక గ్రాము 22, 24 క్యారెట్ ధరలు వరుసగా రూ. 5390 & రూ. 5880గా ఉంది. ఈ లెక్కన 10 గ్రామ్స్ గోల్డ్ ధర రూ. 53900, రూ. 5880. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు రూ. 600 తగ్గుదల కనిపించింది. హైదరాబాద్‌, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, విశాఖపట్టణంలో కూడా ఇదే ధరలు ఉంటాయి.

👉 వెండి విషయానికి వస్తే, హైదరాబాద్‌ & విజయవాడలో ఒక గ్రామ్ వెండి రూ. 76.50. అంటే 1 కేజీ వెండి ధర ఇక్కడ రూ. 76500. నిన్నటి కంటే ఈ రోజు వెండి ధర కేజీ మీద 500 తగ్గినట్లు స్పష్టంగా తెలుస్తోంది.

👉 చెన్నైలో ఒక గ్రాము 22 క్యారెట్ల & 24 క్యారెట్ల బంగారం ధర రూ. 5410 అండ్ రూ. 5902. దీని ప్రకారం 10 గ్రాముల బంగారం రూ. 54100 (22క్యారెట్స్) రూ. 59020 (24 క్యారెట్స్)గా ఉంది.

👉 ఒక గ్రామ్ వెండి ధర చెన్నైలో రూ. 76.50. అంటే 1 కేజీ వెండి ధర ఇక్కడ రూ. 76500. నిన్నటి కంటే ఈ రోజు వెండి ధర కేజీ మీద 500 తగ్గినట్లు స్పష్టంగా తెలుస్తోంది.

👉 దేశ రాజధాని నగరం ఢిల్లీలో ఒక గ్రామ్ 22 క్యారెట్ గోల్డ్ రేట్ రూ. 5405 కాగా 24 క్యారెట్ బంగారం రూ. 5895గా ఉంది. 10 గ్రాముల పసిడి ఇక్కడ రూ. 54050 (22 క్యారెట్) రూ. 58950 (24 క్యారెట్).

👉 వెండి ఒక గ్రామ్ ధర ఢిల్లీలో రూ. 73.70. దీని ప్రకారం ఒక కేజీ వెండి ధర రూ. 73700. నిన్న కంటే నేడు వెండి ధర కేజీపై రూ. 500 వరకు తగ్గింది. మొత్తం మీద పండుగ సీజన్లో బంగారం వెండి ధరలు తగ్గడం పెద్ద గుడ్ న్యూస్ అనే చెప్పాలి.

మరిన్ని వార్తలు