భారీగా పెరిగిన బంగారం ధరలు

1 Apr, 2021 17:51 IST|Sakshi

న్యూఢిల్లీ: కొద్దీ రోజుల నుంచి తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు మళ్లీ భారీగా పెరిగాయి. బంగారం ధర ఎప్పుడు తగ్గుతుందో, ఎప్పుడూ పెరుగుతుందో నిపుణులకు కూడా అంచనా వేయడం కష్టాంగా మారింది. ఇండియన్ బులియన్, జెవెల్లెర్స్ అసోసియేషన్ ప్రకారం దేశ రాజధాని న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో నేడు స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర రూ.44,228 నుంచి రూ.44,917కు పెరిగింది. అలాగే, ఆభరణ తయారీలో వాడే 22 క్యారెట్ల బంగారం ధర రూ.40,513 నుంచి 41,144కు పెరిగింది. అంటే ఒక్కరోజులో 631 రూపాయలు పెరిగింది అన్నమాట.

ఇక హైదరాబాద్ బులియన్ మార్కెట్లో నేడు స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర రూ.44,840 నుంచి రూ.45,440కు పెరిగింది. అలాగే, ఆభరణ తయారీలో వాడే 22 క్యారెట్ల బంగారం ధర రూ.41,100 నుంచి 41,650కు పెరిగింది. అంటే ఒక్కరోజులో 550 రూపాయలు పెరిగింది అన్నమాట. విజయవాడలో కూడా ఇవే ధరలు ఉన్నాయి. బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా పెరిగాయి. నేడు కేజీ వెండి ధర రూ.62,727 నుంచి రూ.63,634కు పెరిగింది. బంగారం ధర హెచ్చుతగ్గులపై ఎన్నో అంశాలు ప్రభావితం చూపుతాయి. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు కారణాల వల్ల బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు ఉంటాయి. 

చదవండి:

కొత్త వేతన కార్మిక చట్టాలకు కేంద్రం బ్రేక్

ఈ స్కీమ్ గడువు పొడగించిన ఎస్‌బీఐ

>
మరిన్ని వార్తలు