వరుసగా రెండో రోజు పెరిగిన బంగారం ధరలు

16 Apr, 2021 17:05 IST|Sakshi

ఏప్రిల్ నెల మొదటి నుంచి బంగారం ధరలు ఓ రేంజ్‌లో పెరుగుతున్నాయి. మధ్యలో రెండు రోజులు ధరలు తగ్గినప్పటికీ మళ్లీ ధరలు పెరుగుతున్నాయి. ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణం కరోనా కేసులు పెరగడమే అని నిపుణులు పేర్కొంటున్నారు. ఇంకా ధరలు పెరిగే అవకాశం ఉన్నట్లు వారు పేర్కొంటున్నారు. అలాగే, వచ్చే శుభ ముహుర్తాలు ఉండటంతో ధర పెరిగే అవకాశం ఉంది. దేశ రాజధాని న్యూఢిల్లీలో 22 క్యారెట్ల గోల్డ్‌ ధర నిన్నటితో పోల్చితే రూ.193 పెరిగి 10 గ్రాముల బంగారం రూ.42,976 వద్ద కొనసాగుతోంది. ఇక 24 క్యారెట్ల గోల్డ్‌ ధర కూడా 211 రూపాయలు పెరిగి రూ.46,917గా ఉంది. 

ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం‌ ధర రూ.300 పెరిగి రూ.44,000గా ఉంది. ఇక 24 క్యారెట్ల గోల్డ్‌ ధర కూడా 330 రూపాయలు పెరిగి రూ.48,000గా ఉంది. విజయవాడ, విశాఖపట్నంలోనూ ఇదే ధరలు కొనసాగుతున్నాయి. అలాగే బంగారం ధరతో పాటు వెండి ధరలు కూడా పెరిగాయి. నేడు కేజీ వెండి ధర రూ.67,953 నుంచి రూ.68,286కు పెరిగింది. అయితే బంగారం కొనుగోలు చేసే వారు ఆ సమయానికి ఏ రేట్లు ఉన్నాయో తెలుసుకొని కొనుగోలు చేస్తే మంచిదని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు సూచిస్తున్నారు.

చదవండి: విదేశీ ఈ-కామర్స్‌ కంపెనీలపై కఠిన నిబంధనలు!

మరిన్ని వార్తలు