ఐదు రోజుల్లో రూ.2వేలు పెరిగిన బంగారం ధరలు

8 Apr, 2021 15:59 IST|Sakshi

బులియన్ మార్కెట్ లో ఏప్రిల్ 1 నుంచి బంగారం ధరలు భారీగా పెరుగుతూ వస్తున్నాయి. ఒకవైపు కరోనా కేసులు భారీగా పెరుగుతుంటే బంగారం ధరలు కూడా పెరుగుతూన్నాయి. భవిష్యత్ లో కూడా బంగారం ధరలు పెరిగే అవకాశం ఉన్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. ఈ విషయం బంగారు కొనుగోలుదారులకు చేదువార్త అని చెప్పుకోవాలి. నేడు కూడా బంగారం ధరలు పెరిగాయి. ఇండియన్ బులియన్, జెవెల్లెర్స్ అసోసియేషన్ ప్రకారం దేశ రాజధాని న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర రూ.45,904 నుంచి రూ.46,152కు పెరిగింది. ఏప్రిల్ 1న రూ.44,228 ఉన్న బంగారం ధర నేడు రూ.46,152కు చేరుకుంది. అలాగే, నగల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర రూ.42,048 నుంచి 42,275కు పెరిగింది.

ఇక హైదరాబాద్ మార్కెట్లో నగల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర నేటి ఉదయం 10 గ్రాములు రూ.43,000 నుంచి రూ.42,650కు చేరుకుంది. నిన్నటి నుంచి ధర రూ.350 పెరిగింది. అలాగే పెట్టుబడులు పెట్టేందుకు వాడే 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ ధర ప్రస్తుతం 10 గ్రాములు రూ.46,530 నుంచి రూ.46,900కు పెరిగింది ఉంది. అంటే ఒక్కరోజులో రూ.370 రూపాయలు పెరిగింది అన్నమాట. హైదరాబాద్, విజయవాడలో బంగారం ధరలు ఒకేలా ఉన్నాయి. బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా పెరిగాయి. నేడు కేజీ వెండి ధర రూ.66,139 నుంచి రూ.66,905కు పెరిగింది. బంగారం ధర హెచ్చుతగ్గులు అనేది ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు విషయాలపై ఆధారపడి ఉంటుంది.

చదవండి: 

యూపీఐ ట్రాన్సాక్షన్​ ఫెయిలైతే.. రూ.100 నష్టపరిహారం

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు