బంగారం కొనుగోలుదారులకు తీపికబురు

19 Feb, 2021 14:45 IST|Sakshi

న్యూఢిల్లీ: బంగారం కొనుగోలు చేయాలని అనుకునే వారికీ తీపికబురు. గత మూడు రోజుల నుంచి బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. బంగారంతో పాటు వెండి ధరలు కూడా తగ్గాయి. ఫిబ్రవరి 17 నుంచి ఇప్పటి వరకు బంగారం ధర రూ.1390 వరకు తగ్గింది. నేడు ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.450 తగ్గి రూ.45,540కు చేరుకుంది. ఇక హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.450 క్షీణించింది. దీంతో నేడు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రేటు రూ.46,900కు దిగొచ్చింది. అదే సమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.400 పైగా క్షిణించి రూ.43,000కు పడిపోయింది. బంగారం ధరతో పాటు వెండి ధరలు కూడా తగ్గాయి. హైదరాబాద్ కేజీ వెండి ధర రూ.2000 పడిపోయి రూ.72,300కు చేరుకుంది. గ్లోబల్ మార్కెట్‌ బంగారం ధరలకు అనుగుణంగా దేశీ మార్కెట్‌లోనూ బంగారం ధరలు హెచ్చు తగ్గులకు గురి అవుతాయి. (చదవండి: కారు కొనాలనుకునే వారికి తీపికబురు)

మరిన్ని వార్తలు