మళ్లీ భారీగా పెరిగిన బంగారం ధరలు

23 Feb, 2021 15:11 IST|Sakshi

దేశంలో కొన్ని రోజులు పాటు తగ్గిన బంగారం ధరలు మళ్లీ పెరుగుతూ వస్తున్నాయి. ఢిల్లీలో ఫిబ్రవరి 10వ తేదీన రూ.46,900గా ఉన్న 22 క్యారెట్ల బంగారం ధర, ఫిబ్రవరి 19వ తేది వచ్చేసరికి రూ.45,150కి చేరుకుంది. మళ్లీ గత రెండు రోజుల నుంచి బంగారం ధరలు పెరుగుతున్నాయి. నేడు దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.590 పెరిగి రూ.46,000కు చేరుకుంది. మరోవైపు వెండి ధరలు కూడా పెరుగుతున్నాయి.

ఇక హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.650 పెరిగి రూ. 47,840కు చేరుకుంది. అదే సమయంలో ఆభరణాల తయారీలో వాడే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.590 పెరిగి రూ.43,850కు చేరుకుంది. బంగారం ధరతో పాటు వెండి ధరలు కూడా పెరిగాయి. హైదరాబాద్ కేజీ వెండి ధర రూ.1300 పెరిగి రూ.75,700కు చేరుకుంది. గ్లోబల్ మార్కెట్‌ బంగారం ధరలకు అనుగుణంగా దేశీ మార్కెట్‌లోనూ బంగారం ధరలు హెచ్చు తగ్గులకు గురి అవుతాయి. భవిష్యత్ లో ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు నిపుణులు తెలుపుతున్నారు. 

చదవండి:

డీహెచ్‌ఎఫ్‌ఎల్‌లో బయటపడ్డ మరో భారీ మోసం

ఎల్‌ఐసీ నుంచి మరో కొత్త పథకం


 

>
మరిన్ని వార్తలు