స్వ‌ల్పంగా త‌గ్గిన బంగారం ధ‌ర‌లు

24 Feb, 2021 15:17 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశంలో బంగారం ధ‌ర‌లు ఇప్పుడు కిందకు చూస్తున్నాయి. ఫిబ్రవరి 20 నుంచి పెరిగిన బంగారం ధరలు నేడు స్వ‌ల్పంగా తగ్గాయి. దేశ రాజ‌ధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ.100 త‌గ్గి రూ.45,900కి చేరింది. క్రితం ట్రేడ్‌లో 10 గ్రాముల బంగారం ధ‌ర రూ.45,600 వ‌ద్ద ముగిసింది. అంత‌ర్జాతీయంగా విలువైన లోహాల ధ‌ర‌ల‌కు డిమాండ్ త‌గ్గ‌డ‌మే దేశంలో ఇవాళ బంగారం ధ‌ర‌లు త‌గ్గ‌డానికి కార‌ణ‌మ‌ని నిపుణులు తెలిపారు. ఇక హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.110 తగ్గి రూ.47,730కు చేరుకుంది. అలాగే ఆభరణాల తయారీలో వాడే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.100 తగ్గి రూ.43,750కు చేరుకుంది. బంగారం ధరలు స్వ‌ల్పంగా తగ్గితే వెండి ధరలు మాత్రం భారీగా తగ్గాయి. హైదరాబాద్ కేజీ వెండి ధర రూ.1300 తగ్గి రూ.74,400కు చేరుకుంది.

చదవండి:

5జీ కోసం క్వాల్‌కామ్‌తో ఎయిర్‌టెల్‌ జట్టు

భారత్ లో విడుదలైన లగ్జరీ బీఎండబ్ల్యూ బైక్

మరిన్ని వార్తలు