Gold Price: భారీగా పెరిగిన బంగారం ధర 

1 Jul, 2021 19:32 IST|Sakshi

గత కొద్ది రోజులగా స్వల్పంగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు నేడు ఒక్కసారిగా భారీగా పెరిగాయి. అంతర్జాతీయంగా బంగారనికి డిమాండ్‌ పెరిగిన నేపథ్యంలో భారత్‌లో పసిడి ధర పెరిగింది. గురువారం నాటి బులియన్‌ ట్రేడింగ్‌లో దేశ రాజధాని దిల్లీలో రూ.10గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.421 పెరిగి రూ.47,194కి చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.386 పెరిగి రూ.43,230కి చేరుకుంది. దేశీయంగా రూపాయి బలహీనపడటం కూడా బంగారం ధర పెరుగుదలకు ఒక కారణం అయినట్లు బులియన్‌ ట్రేడింగ్‌ వర్గాల నిపుణులు తెలిపారు. 

ఇక హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,730 నుంచి రూ.48,000కి పెరిగితే, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,750 నుంచి రూ.44,000కు పెరగింది. వెండి కూడా బంగారం బాటలోనే పయనించింది. ఇటీవల భారీగా తగ్గిన వెండి గురువారం రూ.1,220 పెరిగి కిలో రూ.68,967కు చేరింది. అంతకుముందు కిలో రూ.67,747గా ఉన్న సంగతి తెలిసిందే. 

చదవండి: Nirav Modi: నీరవ్‌మోదీ కేసులో కీలక మలుపు

మరిన్ని వార్తలు