Gold Price Today: బంగారం కొనుగోలు దారులకు భారీ షాక్‌!

10 Apr, 2022 08:59 IST|Sakshi

బంగారం కొనుగోలు దారులకు భారీ షాక్‌ తగిలింది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రపంచ దేశాల్లో బంగారం ధరల పెరగుదలకు కారణమని తెలుస్తోంది. అలాగే భారత్‌లో సైతం బంగారం ధరలు పసిడి ప్రియులకు షాక్ ఇస్తున్నాయి. ఇక దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఆదివారం రోజు 10గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.350 పెరిగింది. అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.390కి పెరిగింది.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి 

దేశ రాజధాని ఢిల్లీలో  పది గ్రాముల  22 క్యారెట్ల బంగారం ధర రూ.48,600  ఉండగా..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.53,020గా ఉంది.

ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,600 ఉండగా..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ.53,020గా ఉంది.  

చెన్నైలో  పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,190 ఉండగా..10గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.53,020గా ఉంది. 

కేరళలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.48,600 ఉండగా..10గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.53,020గా ఉంది.

బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,600గా ఉండగా..10గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.53,020గా ఉంది.   

హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 48,600 ఉండగా..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 53,020గా ఉంది.    

విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,600 ఉండగా ..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.53,020గా ఉంది. 

వైజాగ్‌లో 10గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,600ఉండగా ..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.53,020గా ఉంది. 

మరిన్ని వార్తలు