Today Gold Rate: దివాళీ ఎఫెక్ట్‌ : తగ్గిన బంగారం ధరలు..ఎంతంటే

30 Oct, 2021 11:41 IST|Sakshi

ధంతేరస్‌, దీపావళి ఎఫెక్ట్‌  బంగారం, వెండి ధరలపై పడింది. దీంతో అక్టోబర్‌ 30న గోల్డ్‌ రేట్లు స్వల్పంగా తగ్గాయి. భక్తులు ప్రతి ఏడాది కార్తీక మాసంలోని కృష్ణ పక్ష త్రయోదశి రోజున ధన త్రయోదశి (ధంతేరస్)ని జరుపుకుంటారు. ఈ ఏడాది నవంబర్ 2న ధంతేరస్ రానుంది. దీపావళి పండుగని ధంతేరస్ తో  ప్రారంభింస్తారు.

ముఖ్యంగా ఈ పండుగ పర్వదినం సందర్భంగా భక్తులు బంగారం, వెండి ఆభరణాలు కొనుగోలు చేస్తారు. అలా కొనుగోలు చేసిన ఆభరణాల్ని పూజించడం వల్ల అవి రెట్టింపు అవుతాయని గాఢంగా నమ్ముతారు. అందుకే దనత్రయోదశి ప్రారంభం కంటే రెండు, మూడు రోజుల ముందు నుంచే  ఈ బంగారం, వెండి ధరల్లో మార్పులు చోటు చేసుకుంటాయి.     

ఇక మరో 3రోజుల్లో రానున్న ధనత్రయోదశి కారణంగా దేశంలోని ప్రధాన నగరాలైన హైదరాబాద్‌, బెంగళూరు, కేరళ, వైజాగ్‌లలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి.

బెంగళూరు సిటీలో 10గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.100 తగ్గి.. రూ.44,850 చేరగా.. 10 క్యారెట్ల 24 క్యారెట్ల బంగారం ధర రూ..110 తగ్గి రూ.48,930కి చేరింది. 

హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ.100 తగ్గి.. రూ.44,850కి చేరగా..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.110 తగ్గి రూ.48,930కి చేరింది.      

విశాఖలో  10గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.100 తగ్గి..రూ.44,850కి చేరగా.. 10గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.130 తగ్గి రూ.48,930కి చేరింది. 

కేరళలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.100 తగ్గి రూ.44,850కి చేరగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.130 పెరిగి రూ.48,930కి చేరింది. 

ఇక  హైదరాబాద్‌, కేరళ, వైజాగ్‌లలో కిలో వెండి ధర 68,800 ఉండగా బెంగళూరులో రూ.64,600గా ఉంది.

మరిన్ని వార్తలు