కోవిడ్ రాయితీపై చ‌ర్చ‌, నేడే జీఎస్‌టీ కౌన్సిల్‌ సమావేశం

12 Jun, 2021 10:04 IST|Sakshi

నేడే జీఎస్ టీ మండ‌లి స‌మావేశం

కోవిడ్, బ్లాక్ ఫంగ‌స్ ల‌పై చ‌ర్చ‌

స‌మావేశంలో పాల్గొన‌నున్న ఆర్ధిక మంత్రులు

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అధ్యక్షతన శనివారం జీఎస్టీ మండలి  సమావేశం కానుంది. బ్లాక్‌ ఫంగస్‌ మందులు, కోవిడ్‌ 19 అత్యవసరాలపై పన్ను రాయితీ అంశాన్ని మండలిలో చర్చించవచ్చని తెలుస్తోంది. 44వ మండలి సమావేశంలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రితో సహా రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొంటారు. కోవిడ్‌ 19 చికిత్సకు అవసరమైన ఆక్సీజన్, ఆక్సీమీటర్లు, హాండ్‌ శానిటైర్లు, వెంటిలేటర్లతో సహా పలు ఇతరాలపై జీఎస్‌టీ రాయితీలిచ్చే విషయమై మేఘాలయ డిప్యుటీ సీఎం ఆధ్వర్యంలోని కమిటీ ఇచ్చిన నివేదిక సమావేశంలో చర్చకురానుంది. పలు రాష్ట్రాల మంత్రులు కరోనా ఎసెన్షియల్స్‌పై పన్నురాయితీలకు సుముఖంగా ఉన్నారు. ప్రస్తుతం కరోనా ముందులు, ఆక్సీజన్‌ కాన్సంట్రేటర్లపై 12 శాతం, వాక్సిన్లపై 5 శాతం జీఎస్‌టీ విధిస్తున్నారు. 

చ‌ద‌వండి : వామ్మో రూ. 3,500 కోట్లు ఎగ్గొట్టేశారు..!
 

మరిన్ని వార్తలు