భారీగా పడిపోయిన బంగారం ధరలు 

2 Mar, 2021 15:36 IST|Sakshi

వివాహాది శుభకార్యక్రమాల కోసం బంగారాన్ని కొనుగోలు చేయాలనుకుంటోన్న వారికి ఇదే సరైన సమయంలా కనిపిస్తోంది. రోజు రోజుకీ తగ్గుతోన్న బంగారం ధరలే దీనికి కారణంగా చెప్పవచ్చు. లాక్‌డౌన్‌ సమయంలో రూ.50 వేలు దాటిన తులం బంగారం ధర ఇప్పుడు నెల చూపులు చూస్తుంది. అంతర్జాతీయంగా బంగారంపై పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోతున్న కారణంగా బంగారం ధరలు భారీగా పడిపోయాయి. హైదరాబాద్ మార్కెట్ లో కేవలం ఇవాళ ఒక్కరోజే ధర రూ.950 తగ్గింది. నగల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం 10 గ్రాములు రూ.42,100 ఉంది. ఒక్క గ్రాము బంగారం ధర నేడు రూ.4,210గా ఉంది. అలాగే 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం(ప్యూర్ గోల్డ్) ధర ప్రస్తుతం 10 గ్రాములు రూ.45,930 ఉంది. నిన్నటికీ, ఇవాళ్టికీ ధర రూ.1,040 తగ్గింది. బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా తగ్గాయి. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.1300 తగ్గి రూ.72000కు చేరుకుంది. భవిష్యత్ లో ఇంకా బంగారం ధరలు తగ్గే అవకాశం ఉన్నట్లు నిపుణులు తెలుపుతున్నారు.

చదవండి:

గృహ కొనుగోలుదారులకు ఎస్‌బీఐ గుడ్‌న్యూస్‌

ఏప్రిల్ 1 నుంచి కొత్త పీఎఫ్ రూల్స్!

మరిన్ని వార్తలు