Petrol And Diesel Price:ఆగని పెట్రోమంట..మరోసారి పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

3 Oct, 2021 09:06 IST|Sakshi

దేశంలో సామాన్యుడిపై పెట్రో మంట కొనసాగుతుంది. వరుసగా రుగుతున్న ధరలు సరికొత్త రికార్డ్‌లను క్రియేట్‌ చేస్తున్నాయి. ఆదివారం సైతం లీటర్‌ పెట్రోల్‌ పై 25పైసలు, డీజిల్‌ పై 30పైసలు పెరిగింది. దీంతో దేశంలో పలు ప్రధాన నగరాల్లో డీజిల్‌ ధరలు సెంచరీని క్రాస్‌ చేశాయి. ముఖ్యంగా గత నాలుగు రోజులుగా పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అదే సమయంలో ఇంధన ధరల పెంపుపై కేంద్రం చెప్పిన కారణాలపై పెదవి విరిస్తున్నారు.  

దేశ వ్యాప్తంగా పలు నగరాల్లో పెరిగిన పెట్రోల్‌ డీజిల్‌ ధరలు

హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.106.51 ఉండగా లీటర్‌ డీజిల్‌ ధర రూ.99.04 ఉంది

విజయవాడలో పెట్రోల్ ధర రూ.108.57 ఉండగా డీజిల్ ధర రూ.100.45 ఉంది.  

వైజాగ్‌లో పెట్రోల్ ధర రూ.107.19 ఉండగా..డీజిల్ ధర రూ.99.14 ఉంది. 

ఢిల్లీలో  పెట్రోల్‌ ధర రూ.102.39 ఉండగా..డీజిల్‌ ధర రూ.90.77ఉంది

కోల్‌ కతాలో పెట్రోల్‌ ధర రూ.103.07 ఉండగా .. డీజిల్‌ ధర రూ.93.87 ఉంది

చెన‍్నైలో పెట్రోల్‌  రూ100.01 ఉండగా  డీజిల్‌ ధర రూ.95.31 ఉంది.  

మరిన్ని వార్తలు