తగ్గిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. ఎంత తగ్గిందంటే..

1 Sep, 2021 12:42 IST|Sakshi

పెరిగిన వంట గ్యాస్‌ ధరలు సామాన‍్యులకు గుదిబండగా మారిన తాజాగా స్వల్పంగా తగ్గిన చమురు ధరలు కాస్త ఊరటనిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా వారం రోజులుగా స్టేబుల్‌గా ఉన్న పెట్రోల్‌ ధర ఈరోజు 10 నుంచి 15 పైసలు వరకు తగ్గింది. డీజిల్‌ ధర సైతం 14 నుంచి 15పైసలు తగ్గింది. 

దేశంలోని వివిధ ప్రాంతాల్లో పెట్రో ధరలు
 

ఢిల్లీలోని లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.101.34 ఉండగా డీజిల్‌ రూ.88.77గా ఉంది.
 
ముంబైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.107.39 ఉండగా డీజిల్‌ ధర రూ.96.33గా ఉంది

కోల్‌ కతా లో పెట్రోల్‌ ధర రూ.101.72 ఉండగా డీజిల్‌ ధర రూ.91.84గా ఉంది.
 
చెన్నైలో పెట్రోల్‌ ధర రూ.99.08 ఉండగా డీజిల్‌ ధర రూ.99.38 గా ఉంది.
 
హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.105.40 ఉండగా, డీజిల్‌ రూ. 96.84 గా ఉంది.

విజయవాడలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 107.69 గా ఉండగా, డీజిల్‌ ధర రూ. 98.61 గా ఉంది.
  
 విశాఖపట్నంలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 107.14 కాగా, డీజిల్‌ రూ. 98.06 గా నమోదైంది.

మరిన్ని వార్తలు