Gold Rate: పసిడి ధర పైపైకి..షాకిస్తున్న వెండి

3 Jul, 2021 13:37 IST|Sakshi

తగ్గినట్టే తగ్గి   మళ్లీ పెరుగుతున్న పసిడి ధర

వెయ్యి రూపాయలు ఎగిసిన  కిలో వెండి ధర

సాక్షి, ముంబై: తగ్గినట్టే తగ్గి, వినియోగదారులను మురిపించిన సిడి ధరలు మళ్లీ  పెరుగుతున్నాయి. అయితే మరో విలువైన  మెటల్‌    వెండి ధర  కూడా పైకే చూస్తోంది. ఇటీవల మూడు నెలల కనిష్టానికి చేరిన  పసిడి ధర గత మూడు రోజుల నుంచి  మళ్లీ పరుగందుకుంది. అటు అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధరలు తగ్గుముఖం పట్టం  గమనార్హం.

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,885గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 200 రూపాయలకు మేర ఎగిసి రూ. 44,350కి చేరింది. మరోవైపు వెండి ధర  ఏకంగా వెయ్యి రూపాయలు ఎగిసింది.  తాజా  పెరుగుదలతో కిలో వెండి ధర రూ. 74వేల 900కి చేరింది. నేడు(2021 జూలై 03)  ఢిల్లీ, చెన్నై, కోల్‌కతా, ముంబైలలో ఈ రోజు బంగారం రేట్లు పెరిగాయి. ఢిల్లీలో 22 గ్రాముల 10 గ్రాముల  రూ. 46,350, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.50,360గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,460 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,720గా ఉంది. ఇక వెండి ధర ఢిల్లీ కిలో  రూ. 69,200గా ఉంది. 

మరిన్ని వార్తలు