లాభాల్లో కొనసాగుతున్న స్టాక్‌ మార్కెట్లు

16 Sep, 2021 10:00 IST|Sakshi

దేశీయ స్టాక్‌ మార్కెట్‌లో సెన్సెక్స్‌, నిఫ్టీ సూచీలు సరికొత్త రికార్డ్‌లను క్రియేట్‌ చేస్తున్నాయి. సెన్సెక్స్‌ సూచీలు 58,900మార్క్‌ను టచ్‌ చేయగా..నిఫ్టీ జీవితకాల గరిష్ట స్థాయిలో17550 మార్క్‌ టచ్‌ చేసి ట్రేడింగ్‌ ను కొనసాగిస్తుంది. దీంతో  గురువారం స్టాక్క్‌ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఉదయం 9.50 గంటల సమయంలో నిఫ్టీ 44 పాయింట్లు లాభంతో 17560 వద్ద, సెన్సెక్స్‌ 143 పాయింట్లు పెరిగి 58,866 వద్ద ట్రేడవుతున్నాయి.

టెలికం రంగంలో ఆటోమేటిక్‌ విధానం ద్వారా 100శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతించడంతో వొడాఫోన్‌ ఐడియా షేర్ల లాభాల్లో కొనసాగుతున్నాయి. ఇండస్ టవర్స్‌, ఏపీఎల్‌ అపోలో ట్యూబ్స్‌, అపోలో ట్రైకోటా ట్యూబ్స్‌, జేటీఈకేటీ ఇండియా షేర్లు లాభాల్లో ఉండగా.. హట్సన్‌ అగ్రో ప్రొడక్ట్స్‌,హింద్‌ కాపర్‌, జెన్సార్‌ టెక్నాలజీస్‌, రెస్పాన్సీవ్‌ ఇండస్ట్రీస్‌, పాలీ మెడీక్యూర్‌ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.   

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు