సాక్షి మనీ మంత్రా: దలాల్‌ స్ట్రీట్‌లో బ్లడ్ బాత్‌..రోజంతా నష్టాలే

21 Sep, 2023 15:39 IST|Sakshi

Bloodbath in Today StockMarket:  దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాల్లోనే ముగిసాయి. ఫెడ్‌ రేటు నిర్ణయం,అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలతో ఆరంభంలోనే 500పాయింట్లకు పైగా పతనమైన మార్కెట్‌ రోజంతానష్టాలతోనే కొనసాగింది.  ఒక దశలో  సెన్సెక్స్‌ 620 పాయింట్లకుపైగా నష్టపోగా, నిఫ్టీ 19,730 స్థాయికి  చేరింది.  చివరికి   సెన్సెక్స్ 571 పాయింట్టు కుప్పకూలి 66,230 వద్ద నిఫ్టీ 159 పాయింట్ల  నష్టంతో 19742 వద్ద ముగిసింఇ.

ఆటో, బ్యాంక్, ఫార్మా సూచీలుతోపాటు దాదాపు అన్ని రంగాల షేర్లలోఅమ్మకాల ఒత్తిడి కొనసాగింది. యాక్సిస్‌; హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, ఇండస్‌,కోటక్‌ మహీంద్ర, పీఎన్‌బీ, ఫెడలర్‌,  ఎస్‌బీఐ, తదితర బ్యాంకింగ్‌ షేర్ల నష్టాలో నిఫ్టీ బ్యాంకు దాదాపు 2 శాతం నష్టపోయింది. ఇండా ఎంఅండ్‌ఎం, సిప్లా, హీరో మోటో కార్ప్‌ ఇతర టాప్‌ లూజర్స్‌గా ఉన్నాయి.  మరోవైపు అదానీ పోర్ట్స్‌,టెక్‌ మహీంద్ర, ఏసియన్‌ పెయింట్స్‌, డా. రెడ్డీస్‌ బీపీసీఎల్‌, లాభపడ్డాయి. 

రూపాయి: బుధవారం ముగింపు 83.07తోపోలిస్తే డాలరుమారకంలో దేశీయ కరెన్సీ రూపాయి   స్వల్పంగా నష్టపోయి  83.09 వద్ద ముగిసింది

మరిన్ని వార్తలు