లాభాల్లో కొనసాగుతున్న స్టాక్‌ మార్కెట్లు

5 Aug, 2021 09:43 IST|Sakshi

గురువారం రోజు స్టాక్‌ మార్కెట్లు ప్రారంభ సమయానికి సరికొత్త రికార్డ్‌లను నమోదు చేశాయి. నిఫ్టీ 16,290 పాయింట్లను టచ్‌ చేసి ఫ్రెష్‌ ఆల్‌ టైమ్‌ రికార్డ్‌లను నమోదు చేయగా.. సెన్సెక్స్‌ సైతం అదే దూకుడును ప్రదర్శిస్తూ ఫస్ట్‌ టైమ్‌ 54,500 క్రాస్‌ చేసింది. 

దీంతో మార్కెట్‌ ఉదయం 9.48 నిమిషాల సమయానికి  బీఎస్‌ఈ సెన్సెక్స్‌  47 పాయింట్ల లాభాలతో   54405 వద్ద ట్రేడ్‌ అవుతుండగా..   6 పాయింట్ల స్వల్ప లాభాలతో   నిఫ్టీ 16263 పాయింట్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.టెలికాంలో ఎయిర్‌ టెల్‌ లాభాల్లో కొనసాగుతుండగా ..  టెక్‌ మహీంద్ర, ఏషియన్‌ పెయింట్స్‌, నెస్ట్లే ఇండియా, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌లు అదే జోరును కంటిన్యూ చేస్తున్నాయి. 

>
మరిన్ని వార్తలు