అదనపు పన్నుల ఎఫెక్ట్‌, ఊగిసలాటలో దేశీయ స్టాక్‌ మార్కెట్‌లు!

4 Jul, 2022 10:12 IST|Sakshi

ద్రవ్యోల్బణం, ఆర్ధిక మాంద్యంతో పాటు దేశీయంగా పెట్రోలియం ఉత్పత్తులపై అదనపు పన్నులు, ఆయా కంపెనీల జూన్‌ త్రైమాసిక ఆర్ధిక ఫలితాల నేపథ్యంలో దేశీయ స్టాక్‌ సూచీలు ఊగిసలాటలో కొనసాగుతున్నాయి. 
 
సోమవారం ఉదయం లాభాలతో ప్రారంభమైన మార్కెట్‌లు కొద్ది సేపటికే నష్టాల బాట పట్టాయి. ఆ తర్వాత మళ్లీ పుంజుకొని లాభాల వైపు మొగ్గుచూపడం..కొద్ది సేపటికే తిరిగి నష్టాల‍్లోకి జారుకున్నాయి. దీంతో సోమవారం ఉదయం 10గంటల సమయానికి సెన్సెక్స్‌ 201 పాయింట్లు నష్టపోయి 52706 వద్ద నిఫ్టీ 75 పాయింట్ల పతనంతో 15676 వద్ద కొనసాగుతున్నాయి.  

ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, పవర్‌ గ్రిడ్‌ కార్ప్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎస్‌బీఐ, యాక్సిస్‌ బ్యాంక్, బ్రిటానియా, హెచ్‌యూఎల్‌, హీరో మోటో కార్పొ, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా..జేఎస్‌డ్ల్యూ స్టీల్‌, హిందాల్కో, ఓఎన్‌జీసీ, టాటా స్టీల్‌, కోల్‌ ఇండియా, టీసీఎస్‌,సిప్లా, బీపీసీఎల్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌, ఎంఅండ్‌ ఎం షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. 

మరిన్ని వార్తలు