లాభాల్లో స్కాక్‌ మార్కెట్‌, రికార్డ్‌ స్థాయిల్ని నమోదు చేసిన నిఫ్టీ

12 Aug, 2021 09:36 IST|Sakshi

అంతర్జాతీయ మార్కెట్‌లో సానుకూల ఫలితాలతో వస్తుండటంతో పాటు జులైకి సంబంధించి అమెరికాలో ద్రవ్యోల్బణం అదుపులో ఉన్నట్టుగా వార్తలు రావడంతో స్టాక్‌మార్కెట్‌ పుంజుకుంది. గురువారం ఉదయం మార్కెట్‌ మొదలైనప్పటి నుంచి ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపించారు. దీంతో బీఎస్‌సీ సెన్సెక్స్‌, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీలు లాభాల్లో ఉన్నాయి. 16,000 మార్క్‌ దాటినప్పటి నుంచి నిఫ్టీ లో బుల్‌ జోరు కొనసాగుతోంది. 

ఈ రోజు ఉదయం బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 54,641 పాయింట్లతో మొదలైంది. ఆ వెంటనే వరుసగా పాయింట్లన పొందుతూ ఉదయం 9:45 గంటల సమయంలో 77 పాయింట్లు లాభపడి 54,603 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు నిఫ్టీ 18 పాయింట్లు లాభపడి 16,300 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. మార్కెట్‌లో కెమ్‌ప్లాస్ట్‌ సన్మార్‌ సబ్‌స్క్రిప్షన్‌కి  ఇవాలే ఆఖరి రోజు. 

మరిన్ని వార్తలు