నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

20 Aug, 2021 09:37 IST|Sakshi

గత కొద్దిరోజులుగా కొనసాగుతున్న బుల్‌ జోరుకి బ్రేకులు పడింది. శుక్రవారం మార్కెట్లు నష‍్టాలతో ప్రారంభమయ్యాయి. యరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ అంచనాల(2.2%)ను మించుతూ యూరోజోన్‌ ద్రవ్యోల్బణం 2.20 శాతంగా నమోదుకావడంతో యూరప్‌ మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. వాటి ప్రభావం దేశీ మార్కెట్‌ పై పడింది.

దీంతో  శుక్రవారం 9.34 గంటల సమయానికి  దేశీ మార్కెట్లో సెన్సెక్స్‌ 165.80 పాయింట్లు క్షీణించి 55,296 వద్ద ట్రేడ్‌ అవుతుండగా.. నిఫ్టీ 111.30 పాయింట్లు నష్టపోయి 16,457.55 పాయింట్లతో ట్రేడ్‌  కొనసాగుతుంది. టాటాస్టీల్‌, హీరో మోటో కార్ప్‌, టెక్‌ మహీంద్రా, హిందాల్కో, హెచ్‌సీఎల్‌ టెక్‌ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. 
 

మరిన్ని వార్తలు