సెన్సెక్స్‌ రికార్డ్‌, 57వేల మార్క్‌ క్రాస్‌

31 Aug, 2021 09:46 IST|Sakshi

మంగళవారం స్టాక్‌ మార్కెట్‌లు లాభాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ జోరును కొనసాగిస్తూ 57వేల మార్క్‌ను క్రాస్‌ చేసి కొత్త రికార్డ్‌లను సృష్టించింది. మరో వైపు ఎన్‌ ఎస్‌ఈ నిఫ్టీ సైతం 17వేల మార్క్‌ ను చేరుకునేందుకు పోటీపడుతుంది. గత సెషన్‌లో  సెన్సెక్స్‌  56వేల పాయింట్ల వద్ద, నిఫ్టీ 16,700 దగ్గర తీవ్ర నిరోధతను ఎదుర్కొన్నాయి. ఈ సెషన్‌లో ఎటువంటి అడ్డంకులు లేకుండా రెండు సూచీలు ఆల్‌ టైమ్‌ హైకి చేరుకున్నాయి.

మంగళవారం స్టాక్‌ మార్కెట్‌లు లాభాలతో ప్రారంభమయ్యా.యి అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ బ్యాంక్‌  చైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌ వ్యాఖ్యలు మార్కెట్ల జోరును కంటిన్యూ చేస్తున్నాయి. దీనికితోడు క్యూ1లో జీడీపీ ఫలితాలు ఆశాజనకంగా ఉండవచ్చనే అంచనాలు నెలకొన్నాయి. అంతేకాకుండా ఇన్వెస్టర్లు మార్కెట్‌ పై నమ్మకాన్ని కొనసాగిస్తున్నారు. ఫలితంగా దేశీ సూచీలు ఆకాశమే హద్దుగా ట్రెండ్‌ను క్రియేట్‌ చేస్తున్నాయి. మంగళవారం ఉదయం 9.45గంటల సమయానికి నిఫ్టీ 51.70 పాయింట్ల లాభంతో 16984.45 వద్ద ట్రేడ్‌ అవుతుండగా.. సెన్సెక్స్‌ 219.05 పాయింట్ల లాభంతో  57,108 ట్రేడింగ్‌ కొనసాగుతుంది. 
 

మరిన్ని వార్తలు