అదే జోరు, లాభాల్లో కొనసాగుతున్న స్టాక్‌ మార్కెట్లు

1 Sep, 2021 09:37 IST|Sakshi

దేశీయ స్టాక్‌ మార్కెట్లు వరుసగా భారీ లాభాల్ని మూటగట్టుకుంటున్నాయి. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ చైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌ వ్యాఖ్యలు, క్యూ1లో జీడీపీ ఫలితాల ప్రభావంతో బుధవారం స్టాక్‌ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. బుధవారం ఉదయం 9.30గంటల సమయానికి నిఫ్టీ 47.65 పాయింట్లు లాభపడి 17,179 వద్ద ట్రేడింగ్‌ను కొనసాగిస్తున్నాయి. ఇక సెన్సెక్స్‌ 159.67 పాయింట్లు లాభపడి 57,712.06 వద్ద అదే జోరును కంటిన్యూ చేస్తున్నాయి.  

  అదానీ ట్రాన్స్‌మిషన్‌, అదానీ గ్యాస్‌, అదానీ పవర్‌, యాక్సెస్‌ బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌, బజాస్‌ ఫైనాన్స్‌, జేకే సిమెంట్‌ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. టాటా స్టీల్‌, మారుతి సుజికి, టెక్‌ మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. 

మరిన్ని వార్తలు