బుల్‌ దూకుడు, లాభాల్లో కొనసాగుతున్న స్టాక్‌ మార్కెట్లు

17 Sep, 2021 09:36 IST|Sakshi

కేంద్ర కేబినెట్‌ తీసుకున్న కీలక నిర్ణయాలు స్టాక్‌ మార్కెట్‌లో బుల్‌ దూకుడును పెంచాయి. బ్యాంకుల మొండి బకాయిల పరిష్కారానికి సంబంధించి బ్యాడ్‌ బ్యాంక్‌ ఏర్పాటు, టెలికాం రంగానికి చేయూతనిస్తూ కేంద్ర కేబినేట్‌ నిర్ణయం తీసుకుంది.

దీంతో మదుపర్లు కొనుగోలుకు మొగ్గు చూపడంతో శుక‍్రవారం ఉదయం 9.30 గంటల సమయానికి మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్‌  422.26 పాయింట్ల లాభంతో 59,552 ట్రేడింగ్‌ కొనసాగుతుండగా, నిఫ్టీ 109 పాయింట్ల లాభంతో 17,739.77 వద్ద ట్రేడ్‌ అవుతోంది.    

ఎథీర్‌ మోటార్స్‌, రిలయన్స్‌, విప్రో, క్లిపా, గ్రాసిం షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా..టాటా స్ట్రీల్‌, జేఎస్‌ డబ్ల్యూ  స్టీల్‌, దివిస్‌ ల్యాబ్స్‌, ఇన్ఫోసిస్‌ షేర్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి.  

మరిన్ని వార్తలు