Stock Market: స్టాక్‌ మార్కెట్‌లో బుల్‌ జోరు, 60 వేల మార్క్‌ను క్రాస్‌ చేసిన సెన్సెక్స్‌

24 Sep, 2021 09:55 IST|Sakshi

Stock Market

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌ మార్కెట్లు సరికొత్త రికార్డ్‌లను క్రియేట్‌ చేస్తున్నాయి. శుక్రవారం సెన్సెక్స్‌ మార్కెట్ల ప్రారంభ సమయంలో 60,000 మార్క్‌ మైలురాయిని టచ్‌ చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో సెన్సెక్స్‌ 50వేల మార్క్‌ను క్రాస్‌ చేయగా కేవలం ఆరునెలల్లో మరో 10 వేల పాయింట్లను టచ్‌ చేసి అంతర్జాతీయ మార్కెట్‌లతో పోటీ పడుతున్నాయి.
 

ఇక శుక్రవారం ఉదయం 9.44 గంటల సమయానికి సెన్సెక్స్‌ 319.68 పాయింట్ల లాభంతో 60,205 ట్రేడింగ్‌ చేయగా నిఫ్టీ 90.2 పాయింట్ల లాభంతో 17913 వద్ద ట్రేడింగ్‌ను కొనసాగిస్తుంది. ఇన్ఫోసిస్‌, ఏషియన్ పెయింట్స్‌,ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌,ఐసీఐసీఐ బ్యాంక్‌,హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌,హెచ్‌సీఎల్‌ టెక్‌,టీసీఎస్‌, ఎల్‌అండ్‌టీ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. హెచ్‌డీఎఫ్‌సీ, టాటా స్టీల్‌,ఎన్‌టీపీసీ,టైటన్‌,బజాజ్‌ ఫినాన్స్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

చదవండి: ఒక్క నిమిషానికి ఈ కంపెనీలు ఎంత సంపాదిస్తున్నాయో తెలుసా?!

మరిన్ని వార్తలు