సంక్షోభంలోనూ.. లాభాలతో కొనసాగుతున్న స్టాక్‌ మార్కెట్లు

4 Oct, 2021 09:33 IST|Sakshi

అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం దేశీయ మార్కెట్లపై చూపలేకపోయింది. పలు దేశాల కేంద్ర బ్యాంకులు వడ్డీరేట్ల పెంపు యోచన, చైనాలో తాజాగా నెలకొన్న సంక్షోభాలు కలవరానికి గురిచేస్తున్నా దేశీయ మదుపర్లు ఇన్వెస్ట్‌ చేసేందుకు మొగ్గుచూపుతున్నారు. దీంతో సోమవారం ఉదయం ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. సోమవారం ఉదయం 9.20గంటల సమయానికి సెన్సెక్స్‌ 331.61 పాయింట్ల లాభంతో 59097.19 వద్ద ట్రేడింగ్‌ను కొనసాగిస్తుండగా.. నిఫ్టీ సైతం 96 పాయింట్లు లాభపడి 17628 పాయింట్ల వద్ద ట్రేడింగ్‌ కొనసాగుతుంది. 

దివిస్‌ ల్యాబ్స్‌, టాటా మోటార్స్‌, ఎం అండ్‌ ఎం, ఓఎన్‌జీసీ,ఎన్‌టీపీసీ,ఎస్‌బీఐ,బజాజ్‌ ఫిన్‌సర్వ్‌,హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. గ్రాసిం, జేఎస్‌డ్ల్యూ స్టీల్‌, టాటా స్టీల్‌, యూపీఎల్‌, ఐచర్ మోటార్స్‌, నెస్లే, టైటాన్‌ కంపెనీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. 

మరిన్ని వార్తలు