దేశీయ స్టాక్ మార్కెట్లపై బేర్ పంజా...నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు

24 Mar, 2022 09:34 IST|Sakshi

దేశీయ స్టాక్ మార్కెట్లపై గురువారం బేర్​ పంజా విసిరింది. దీంతో సూచీలు కుప్ప కూలి గురువారం ఉదయం ప్రారంభం నుంచి స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. 

మన దేశంలో పెట్రోల్ ధరలు పెరగడం, రష్యా–ఉక్రెయిన్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితుల వల్ల గోధుమలు, పామాయిల్‌ వంటి కమోడిటీలతో పాటు ప్యాకేజింగ్‌ మెటీరియల్స్‌ మొదలైన వాటి రేట్లు పెరగడంతో ఆ భారాన్ని వినియోగదారులకు బదలాయించేందుకు ఎఫ్‌ఎంసీజీ (ఫాస్ట్‌ మూవింగ్‌ కన్జూమర్‌ గూడ్స్‌) సంస్థలు సిద్ధమవ్వడం, అంతర్జాతీయంగా  అమెరికా బాండ్లపై వడ్డీరేట్లు పెరగుతుండడం,యూరప్‌లో యుద్ధం పరిస్థితులు, పశ్చిమ దేశాల కేంద్ర బ్యాంకుల వడ్డీరేట్ల పెంపు నిర్ణయాలు సెంటిమెంట్‌ను బలహీనపరిచాయి

దీంతో దేశీయ స్టాక్‌ మార్కెట్లు గురువారం ఉదయం 9.20గంటలకు సెన్సెక్స్‌  పాయింట్లు నష్టపోయి 57370 వద్ద ట్రేడ్‌ అవుతుండగా..నిఫ్టీ 489 పాయింట్లు నష్టపోయి 35659 పాయింట్ల వద్ద ట్రేడింగ్‌ ను కొనసాగుతుంది. 

కోల్‌ఇండియా, హిందాల్కో, ఓఎన్‌జీసీ, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌, జేఎస్‌డబ్ల్యూస్టీల్‌, టాటా స్టీల్‌, అదానీ పోర్ట్‌ స్టాక్స్‌ లాభాలతో కంటిన్యూ అవుతుండగా..కొటాక్‌, ఐసీఐసీఐ,హెచ్‌డీఎఫ్‌సీ, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

మరిన్ని వార్తలు