-

యుద్ధ భయాలు..నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు!

25 Mar, 2022 09:39 IST|Sakshi

దేశీయ స్టాక్‌ మార్కెట్లపై అంతర్జాతీయ పరిణామాల ప్రభావం తీవ్రంగా ఉంది. దీంతో శుక్రవారం దేశీయ స్టాక్‌ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.  ఉక్రెయిన్‌ - రష్యా యుద్ధం, ఆ యుద్ధం వల్ల భారత్‌పై ప్రభావం ఎక్కువగా ఉంటుందంటూ ఐక్యరాజ్యసమితి వాణిజ్య, అభివృద్ధి వ్యవహారాల విభాగం (యూఎన్‌సీటీఏడీ) కీలక వ్యాఖ్యలు చేసింది.

ఈ వ్యాఖ్యలు దేశీయ ముదుపర్ల సెంటిమెంట్‌ను దెబ్బ తీశాయి. దీంతో శుక్రవారం ఉదయం 9.30గంటల సమయంలో సూచీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి.సెన్సెక్స్‌ 124పాయింట్లు నష్టపోయి 57471 వద్ద, నిఫ్టీ 106 పాయింట్లు నష్టపోయి 17204తో ట్రేడింగ్‌ను కొనసాగిస్తుంది. 

బజాజ్‌ ఆటో, యూపీఎల్‌, హీరో మోటో కార్పొ, ఎస్‌బీఐ, భారతీ ఎయిర్‌టెల్‌, ఎం అండ్‌ ఎం, ఓఎన్‌జీసీ, హిందాల్కో, బజాజ్‌ ఫైనాన్స్‌ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. టాటా కాన్స్‌, టైటాన్‌ కంపెనీ, మారుతి సుజికీ, టెక్‌ మహీంద్రా,ఏషియన్‌ పెయింట్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ, నెస్లే, డాక్టర్‌ రెడ్డీ ల్యాబ్స్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లు నష్టాలతో కొట్టుమిట్టాడుతున్నాయి.   
 

మరిన్ని వార్తలు