నేడే ఎల్‌ఐసీ ఐపీవో ..స్వల్ప నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు!

4 May, 2022 09:35 IST|Sakshi

దేశీయ స్టాక్‌ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో కొనసాగుతున్నాయి. జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు దేశీ సూచీలపై ప్రభావం చూపుతున్నాయని మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. దీంతో బుధవారం ఉదయం 9.30గంటలకు సెన్సెక్స్‌ 29 పాయింట్లు నష్టపోయి 56946 పాయింట్లు, నిఫ్టీ 14పాయింట్లు నష్టపోయి 17054 పాయింట్ల వద్ద ట్రేడింగ్‌ను కొనసాగిస్తుంది. 

ఇక బ్రిటానియా,ఎన్టీపీసీ,ఓఎన్‌జీసీ, పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌, యూపీఎల్‌, ఇన్ఫోసిస్‌,టాటా స్టీల్‌, బీపీసీఎల్‌, విప్రో, టాటామోటార్స్‌ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా..అపోలో హాస్పిటల్‌, టైటాన్‌ కంపెనీ, భారతీ ఎయిర్టెల్‌, హిందాల్కో, సన్‌ ఫార్మా, దివిస్‌ ల్యాబ్స్‌, శ్రీ సిమెంట్‌, కిప్లా, ఎంఅండ్‌ ఎం, ఏషియన్‌ పెయింట్స్‌ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.  

ఎల్‌ఐసీ ఐపీవో ప్రారంభం
అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఎల్‌ఐసీ ఐపీవో రానే వచ్చింది. నేటి నుంచే ఐపీఓకు ధరఖాస్తు చేసుకోవచ్చు. మే 9 వరకు అందుబాటులో ఉంటుండగా.. పాలసీ దార్లు, ఇన్వెస్టర్లు ఐపీవో ధరఖాస్తు చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఎల్‌ఐసీ ఐపీవో ధర రూ.902 నుంచి రూ.949 మధ్యలో ఉండగా.. పాలసీదార‍్లకు రూ.60, రీటైలర్లు,ఉద్యోగులకు రూ.45 చొప్పున డిస్కౌంట్లు ఇస్తున్నారు.

మరిన్ని వార్తలు