బుల్‌ జోరు, లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు!

4 Apr, 2022 09:28 IST|Sakshi

జాతీయ, అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం దేశీయ మార్కెట్లపై అనుకూల ప్రభావాల్ని చూపుతున్నాయి. దీంతో  స్టాక్‌ మార్కెట్లు సోమవారం ఉదయం ప్రారంభం నుంచి లాభాల్లో కొనసాగుతున్నాయి. 

ముఖ్యంగా కొత్త ఆర్ధిక సంవత్సరం సందర్భంగా  ఆర్‌బీఐ తొలి ద్వైమాసిక పాలసీ సమావేశం బుధవారం(ఏప్రిల్‌ 6న) నిర్వహించనుంది. దీంతో పాటు రష్యాతో చమురు కొనుగోళ్ల ఒప్పొందాలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు దేశీయ మార్కెట్లపై ప్రభావం చూపించనుందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి ట్రెండ్‌ బుల్స్‌కు అనుకూలంగా ఉన్నాయి. దీంతో సోమవారం ఉదయం 9.20గంటలకు దేశీయ స్టాక్‌ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. 

సెన్సెక్స్‌ 619 పాయింట్లు లాభపడి 59896 పాయింట్ల వద్ద, నిఫ్టీ 158 పాయింట్ల లాభపడి 17828 వద్ద ట్రేడింగ్‌ను కొనసాగిస్తుంది. ఇక హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, అదానీ పోర్ట్స్‌,టెక్‌ మహీంద్రా, టైటాన్‌ కంపెనీ, ఏసియన్‌ పెయింట్స్‌, హిందాల్కో షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. ఎంఅండ్‌ఎం, ఇన్ఫోసిస్‌, ఎథేర్‌ మోటార్స్‌, శ్రీ సిమెంట్స్‌, ఓఎన్‌జీసీ, యాక్సిక్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్స్యూరెన్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ షేర‍్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

మరిన్ని వార్తలు