సాక్షి మనీ మంత్ర: నష్టాల బాటలో దేశీయ స్టాక్‌ మార్కెట్లు

7 Nov, 2023 08:49 IST|Sakshi

Today Stock Market Opening: నిన్న లాభాలతో ప్రారంభమై, లాభాల్లోనే ముగిసిన స్టాక్ మార్కెట్లు.. ఈ రోజు నష్టాల బాట పట్టాయి. ఉదయం 9:15 గంటలకు సెన్సెక్స్ 152.08 పాయింట్ల నష్టంతో 64676.44 వద్ద, నిఫ్టీ 42.15 పాయింట్ల తగ్గుదలతో 19354.95 వద్ద ముందుకు సాగుతున్నాయి. నేడు నిఫ్టీ, సెన్సెక్స్ రెండూ నష్టాల్లోనే ముందుకు వెళుతున్నాయి.

యూఎస్‌ మార్కెట్లు సోమవారం స్వల్ప లాభాలతో ముగిశాయి. ఐరోపా సూచీలు నష్టాల్లో స్థిరపడ్డాయి. ఆసియా మార్కెట్లు మంగళవారం నష్టాల్లో చలిస్తున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థ మధ్యకాల వృద్ధి అంచనాలను ఫిచ్‌ రేటింగ్స్‌ పెంచింది. ఉద్యోగ రేటులో మెరుగుదల, పని చేసే జనాభా వయసు మోస్తరుగా పెరగొచ్చన్న అంచనాల మధ్య భారత జీడీపీ వృద్ధి అంచనాలను 70 బేసిస్‌ పాయింట్లు పెంచి 6.2 శాతానికి చేర్చినట్లు ఫిచ్‌ రేటింగ్స్‌ తెలిపింది. అక్టోబరు నెల మొత్తం వాహన అమ్మకాలు, గతేడాది ఇదే సీజన్‌తో పోలిస్తే 7.73 శాతం తగ్గినట్లు వాహన డీలర్ల సమాఖ్య ఫాడా తెలిపింది. విదేశీ సంస్థాగత మదుపర్లు రూ.543 కోట్లు విలువ చేసే భారత ఈక్విటీలను విక్రయించారు. దేశీయ సంస్థాగత మదుపర్లు రూ.596 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

టాప్ గెయినర్స్ జాబితాలో ప్రధానంగా బజాజ్ ఫిన్‌సర్వ్, బజాజ్ ఆటో, హీరో మోటోకార్ప్, ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, అదానీ పోర్ట్స్ వంటివి ఉన్నాయి. దివీస్ ల్యాబ్స్, టాటా స్టీల్, అపోలో హాస్పిటల్, మహీంద్రా అండ్ మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ నష్టాల్లో కొనసాగుతున్నాయి. 

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)

మరిన్ని వార్తలు