అసలే పెళ్లిళ్ల సీజన్‌.. దేశంలో బంగారం ధరలు పెరుగుతాయా? తగ్గుతాయా?

17 Feb, 2024 13:44 IST|Sakshi

దేశంలో పెళ్లిళ్ల సీజన్‌ మొదలైంది. దీంతో బంగారం ధరల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. నిన్న మొన్నటి వరకు తగ్గినట్లే తగ్గిన పసిడి ధరల్లో మళ్లీ పెరుగుదల మొదలైంది.

మార్కెట్‌లో బంగారంపై ఉన్న డిమాండ్‌ దృష్ట్యా రానున్న రోజుల్లో పసిడి ధరలు పెరిగే అవకాశం ఉందని మార్కెట్‌ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఫిబ్రవరి 17న దేశంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర స్వల్పంగా రూ.100 పెరగగా..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరపై రూ.110 పెరిగింది. 

ఇక దేశంలో వివిధ ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఒక్కసారి పరిశీలిస్తే

హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,200 ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,400గా ఉంది.     
 
విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,200 ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,400గా ఉంది.

విశాఖ ప‌ట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,200 ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,400గా ఉంది.

చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,800 ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.63,050గా ఉంది. 

ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,200 ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,400గా ఉంది.

ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,350 ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,550గా ఉంది.

whatsapp channel

మరిన్ని వార్తలు