Petrol Diesel Prices: కొనసాగుతున్న పెట్రో సెగ

10 Feb, 2021 09:53 IST|Sakshi

వరోసగా రెండో రోజు పెట్రో వడ్డింపు

దేశీయంగా రికార్డు స్థాయికి పెట్రోలు, డీజిల్‌ ధరలు

సాక్షి, ముంబై:  ఇంధన ధరలసెగ కొనసాగుతోంది.  వరుసగా రెండవ రోజు బుధవారం (ఫిబ్రవరి 10) నాటి పెంపుతో పెట్రోల్, డీజిల్‌ రికార్డు స్థాయిలను తాకాయి.  దేశవ్యాప్తంగా  పెట్రోల్ ధరలను లీటరుకు 26-30 పైసలు పెంచగా, దేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో డీజిల్ ధరను 24-29 పైసలు చొప్పునపెంచుతూ ఆయిల్‌ కంపెనీ నిర్ణయించాయి.   (పెట్రో షాక్‌: రికార్డు ధరలు)

ఢిల్లీలో పెట్రోల్ రేట్లు లీటరుకు రూ .87.30 కు చేరుకోగా, పెట్రోల్ ధర లీటరుకు రూ .77.73 కు పెరిగింది.  మంగళవారం రేటుతో పోలిస్తే 29 పైసలు పెరిగిన తరువాత ముంబైలో లీటరు పెట్రోల్‌కు 94.12 రూపాయలు , డీజిల్ ధర రూ .84.63 గా ఉంది.

ప్రధాన నగరాల్లో పెట్రోల్ , డీజిల్ ధరలు లీటరుకు 
కోల్‌కతాలో పెట్రోల్  ధర  రూ .88.92 డీజిల్ ధర రూ .81.31
చెన్నైలో పెట్రోల్ ధర రూ .89.96   డీజిల్‌ ధర రూ . 82.90 
బెంగళూరులో పెట్రోల్ రూ.90.53 డీజిల్ రూ.82.40

హైదరాబాదులో పెట్రోల్  ధర  రూ. 91.09, డీజిల్ ధర రూ. 84.79 (27పైసలు పెంపు)
అమరావతిలో పెట్రోల్  రూ. 93.74,  డీజిల్ రూ. 86.94 (27పైసలు పెంపు)

మరిన్ని వార్తలు