డిజిటల్‌ చెల్లింపులో సరికొత్త ఒరవడిని సృష్టించనున్న ఇండియన్‌ స్టార్టప్‌..!

19 Aug, 2021 19:59 IST|Sakshi

బెంగళూరు: డిజిటల్‌ పేమెంట్లు, యూపీఐల రాకతో పూర్తిగా వ్యాపార లావాదేవీలు డిజిటల్‌ రూపంలో జరుగుతున్నాయి. డిజిటల్‌ పేమెంట్లు ప్రజల నిత్యజీవితంలో ఒక భాగమైపోయాయి. చిన్న పాన్‌ డబ్బా నుంచి సూపర్‌ మార్కెట్ల వరకు డిజిటల్‌ పేమెంట్లను యాక్సెప్ట్‌ చేస్తున్నాయి. ప్రజలు కూడా ఎక్కువగా యూపీఐ, డిజిటల్‌ చెల్లింపుల వైపే మొగ్గుచూపుతున్నారు. గూగుల్‌ పే, ఫోన్‌పే, పేటియం, యోనో,వంటి యాప్‌లను ఉపయోగించి చెల్లింపులను జరుపుతున్నారు. ఈ యాప్‌లతో నగదు బదిలీ చేయాలంటే కచ్చితంగా ఇంటర్నెట్‌ కావాల్సిందే. (చదవండి: Google: గూగుల్‌కు మరోసారి భారీ షాక్‌...!)


డిజిటల్‌ చెల్లింపులు గణనీయంగా జరుగుతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం ​థర్డ్‌పార్టీ యాప్స్‌ల జోక్యం తగ్గించడం కోసం తాజాగా ఈ-రూపీని ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. ఈ-రూపీ తో ఇంటర్నెట్‌ లేకుండా చెల్లింపులు జరిపే వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. ఇంటర్నెట్‌ లేకుండా నగదు చెల్లింపుల వ్యవస్థపై బెంగళూరుకు చెందిన స్టార్టప్‌ టోన్‌టాగ్‌ కూడా పనిచేస్తోంది. డిజిటల్‌ చెల్లింపుల విధానంలో సరికొత్త ఒరవడిని టోన్‌టాగ్‌ సృష్టించనుంది. ప్రత్యేకమైన సౌండ్‌ వేవ్‌ టెక్నాలజీనుపయోగించి డిజిటల్‌ పేమెంట్లు జరిగేలా టోన్‌టాగ్‌ పనిచేస్తోంది.

పలు మార్కెట్స్‌లో, షాపింగ్‌ మాల్స్‌లో చెల్లింపులు జరిపే సమయాన్ని సుమారు 22 సెకండ్లకు కుదించింది. అంతేకాకుండా షాపింగ్‌మాల్స్‌లో, సూపర్‌మార్కెట్లలో పిక్‌ అండ్‌ గో షాపింగ్‌ అనుభూతిని టోన్‌ట్యాగ్‌ అందిస్తోంది.  టోన్ ట్యాగ్ తన చెల్లింపు నెట్‌వర్క్‌ భాగంగా 5 లక్షల మంది వ్యాపారులను,  తన బ్యాంకింగ్ భాగస్వామి నెట్‌వర్క్ ద్వారా 14 లక్షల మంది వ్యాపారులను ఆన్‌బోర్డ్ చేసింది. టోన్‌ట్యాగ్‌ ఇప్పటివరకు  4,500 స్మార్ట్ స్టోర్లను ప్రారంభించింది. టోన్‌టాగ్‌ స్టార్టప్‌కు ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థ అమెజాన్‌ ఫండ్‌ చేసింది. అంతేకాకుండా మాస్టర్‌కార్డు, రిలయన్స్‌ క్యాపిటల్‌ వంటి దిగ్గజ సంస్థలు కూడా టోన్‌టాగ్‌ స్టార్టప్‌కు నిధులను సమకూర్చాయి.   (చదవండి: WhatsApp:మీరు అనుకుంటే వాట్సాప్‌లో కనిపించకుండా చేయవచ్చు.!)

మరిన్ని వార్తలు